...
...
Next Story

Venus Moon Conjunction: మీన రాశిలో శుక్ర, చంద్రుల కలయిక.. ఈ మూడు రాశుల వారు నక్కతోక తొక్కినట్టే!

మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 26 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 18న చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో శుక్ర, చంద్రుల కలయిక ఏర్పడుతుంది. ఇది మార్చి 21 వరకు ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు.

Published on: Feb 14, 2026, 15:00:10 IST
Advertisement

ఎప్పటికప్పుడు గ్రహాలు రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు ఇలా రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు కొన్ని గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. దీంతో యోగాలు ఏర్పడతాయి. అవి 12 రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకొస్తాయి. కొన్ని సార్లు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్ర, చంద్రుల కలయిక

Venus Moon Conjunction: మీన రాశిలో శుక్ర, చంద్రుల కలయిక (pinterest)
Venus Moon Conjunction: మీన రాశిలో శుక్ర, చంద్రుల కలయిక (pinterest)

పంచాంగం ప్రకారం చూసినట్లయితే మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి అధిపతి గురువు. మార్చి 26 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదిలా ఉంటే మార్చి 18న చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో శుక్ర, చంద్రుల కలయిక ఏర్పడుతుంది.

ఇది మార్చి 21 వరకు ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. అప్పులు తీరిపోతాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి వివిధ లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో, వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.

మీన రాశిలో శుక్ర, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. అనేక విధాలుగా మార్పులను చూస్తారు. కెరీర్‌లో, వ్యాపారంలో కూడా మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి దృఢంగా మారుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

2.ధనస్సు రాశి:

మకర రాశి వారు కూడా ఈ రెండింటి సంయోగం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ రాశి మూడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడడంతో ధైర్యం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. అప్పులు తీరిపోతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks