ప్రతి నెల కూడా ఏదో ఒక గ్రహ సంచారంలో మార్పు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు రెండు, మూడు గ్రహాల కలయిక కూడా జరుగుతుందని చూస్తూ ఉంటాం. మార్చి నెల కూడా రాబోతోంది. 2026 మార్చి నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో కొన్ని సంయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు, సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది.

అలాగే శని, సూర్య, శుక్రుల మధ్య కూడా శక్తివంతమైన సంయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ సంయోగాలు ముఖ్యమైన మార్పులను తీసుకువస్తాయి. మార్చి నెలలో సూర్య, శని, శుక్రుల సంయోగం మీన రాశిలో జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.
శుక్ర, సూర్య, శని కలయిక
2026 మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీనరాశిలో శని సంచారం జరుగుతోంది. కాబట్టి మూడు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ కలయిక ఏర్పడడం విశేషం. అదే విధంగా సూర్య, శుక్రుల కలయికతో శుక్రాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. మరి మార్చిలో ఈ మూడు ప్రధాన గ్రహాల సంయోగంతో ఏ రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం.
మూడు గ్రహాల శక్తివంతమైన కలయికతో ఈ రాశులకు బోలెడు లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి మార్చి నెలలో బాగా కలిసి రాబోతోంది. ఈ మూడు పెద్ద గ్రహాల సంయోగంతో ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుత సమయం.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. పని ప్రదేశంలో ఒత్తిడి కూడా కాస్త ఎక్కువవచ్చు. జీవిత భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వస్తుంది.
3.ధనస్సు రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి కూడా ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. పని ప్రదేశంలో ఒత్తిడి కూడా కాస్త ఎక్కువవచ్చు. జీవిత భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వస్తుంది.
3.ధనస్సు రాశి:
{{/usCountry}}ధనస్సు రాశి వారికి ఇది మంచి సమయం. అదృష్టం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కెరీర్‌లో కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో బంధం దృఢంగా మారుతుంది.
4.మకర రాశి:
మకర రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ మూడు గ్రహాల సంయోగంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. టెన్షన్లు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది.