Love Remedies: ఈ ప్రేమికుల రోజు కంటే ముందే మీ ప్రేమ సక్సెస్ అవ్వాలా? అయితే ఈ సులువైన, శక్తివంతమైన పరిహారాలు ట్రై చేయండి!

ప్రేమలో సక్సెస్ అయ్యే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మీరు కూడా ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? కానీ ఏదో ఒక సమస్య వస్తోందా? అయితే మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించండి. దీంతో మీ ప్రేమ మరింత దృఢంగా మారుతుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరిస్తారు. 

Published on: Feb 9, 2026, 10:00:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు. ప్రేమలో సక్సెస్ అయ్యే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మీరు కూడా ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? కానీ ఏదో ఒక సమస్య వస్తోందా? అయితే మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించండి. దీంతో మీ ప్రేమ మరింత దృఢంగా మారుతుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరిస్తారు. ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

Love Remedies: ఈ ప్రేమికుల రోజు కంటే ముందే మీ ప్రేమ సక్సెస్ అవ్వాలా? (pinterest)
Love Remedies: ఈ ప్రేమికుల రోజు కంటే ముందే మీ ప్రేమ సక్సెస్ అవ్వాలా? (pinterest)

ప్రేమ మరింత దృఢంగా మారాలన్నా, పెద్దలు ఒప్పుకోవాలన్నా ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి

ప్రేమ వివాహం అవ్వాలంటే శివ–పార్వతులను, లక్ష్మీ–విష్ణువులను, శ్రీకృష్ణుడును పూజించండి. దీంతో వారి అనుగ్రహం కలిగి ప్రేమ వివాహం జరుగుతుంది. పెద్దలు కూడా మీ ప్రేమను ఒప్పుకుంటారు. అలాగే పూజ చేసేటప్పుడు గులాబీ పూలను, నెయ్యి దీపాలను కచ్చితంగా సమర్పించేటట్లు చూసుకోండి. అలాగే ఉపవాసం ఉండడం, దానాలు చేయడం వంటివి పాటించినట్లయితే గ్రహాలలో సమతుల్యత ఉంటుంది.

ఈ శక్తివంతమైన మంత్రాలను జపిస్తే ప్రేమ విజయవంతం అవుతుంది. వినాయకుడికి గరికను సమర్పించి ఆరాధిస్తే విఘ్నాలు, అడ్డంకులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ప్రేమ జీవితంలో పురోగతిని చూడడానికి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా మంచిది. ఇది ప్రతికూల శక్తిని తొలగించి రిలేషన్‌షిప్‌లో పురోగతిని తీసుకువస్తుంది.

ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవ్వాలంటే ఈ మంత్రాలను పఠించండి

“ఓం శుం శుక్రాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు శుక్రవారం నాడు జపించండి. దీంతో ప్రేమ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. రొమాన్స్ పెరుగుతుంది, ఆకర్షణ కూడా ఎక్కువవుతుంది.

గౌరీ శంకర మంత్రం: “ఓం గౌరీ శంకరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా చక్కటి మార్పులను చూడొచ్చు.

స్వయం వర పార్వతీ మంత్రాన్ని జపిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కోరుకున్న జీవిత భాగస్వామి కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా మారతారు.

“ఓం నమః శివాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కూడా ప్రేమ జీవితంలో చక్కటి మార్పులను చూడొచ్చు.

సులువైన పరిహారాలు

  • సోమవారం నాడు శివ, పార్వతులను ఆరాధించి ఉపవాసం ఉంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి ఘడియలు సమీపిస్తాయి.
  • శుక్రవారం నాడు తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులు వేసుకోండి. బియ్యం, పాలు, స్వీట్లు వంటివి సమర్పించండి. దీంతో శుక్ర స్థానం బలపడుతుంది. అనుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుంది.
  • గురువారం నాడు స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్లలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయడం వలన పెళ్లిలో ఉన్న ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుంది.

రత్నాలు, వాస్తు నియమాలు:

రోజ్ క్వార్ట్జ్ ని బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి లేదా దానిని ధరించండి. దీంతో ప్రేమ జీవితంలో ఒక మెట్టు ముందుకు వెళ్లొచ్చు. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశం ఉంది.

బెడ్‌రూమ్‌లో తాజా పూలు లేదా గౌరీ శంకర రుద్రాక్షను నైరుతి దిశలో పెట్టండి. ఇక సానుకూల మార్పులను చూస్తారు. రొమాంటిక్ వైబ్రేషన్స్ కలుగుతాయి.

ఎమరాల్డ్‌ను ధరించడం వలన జాతకంలో బుధుడు స్థానం బలపడుతుంది. బుధుడు కమ్యూనికేషన్, రిలేషన్‌షిప్స్‌కు కారకుడు. వజ్రాలు ధరిస్తే కూడా శుక్ర స్థానం బలపడుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.

శుక్ర స్థానం ఇలా బలపడుతుంది

జాతకంలో శుక్రుడు స్థానం బలపరిస్తే ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్ర స్థానం బలపడడానికి లక్ష్మీదేవిని ఆరాధించి తెల్లటి పూలను సమర్పించి స్వీట్లు నైవేద్యంగా పెట్టండి. అవసరమైన స్త్రీలకు సాయం చేయడం, పెళ్లికి సంబంధించిన వాటిలో సహాయం చేయడం వంటివి చేస్తే జాతకంలో శుక్ర స్థానం బలపడుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More