Venus Sun Saturn Conjunction: మహా సంచారం.. శుక్ర, సూర్య, శని గ్రహాల కలయికతో నాలుగు రాశులకు గోల్డెన్ డేస్!
మార్చి నెల కూడా రాబోతోంది. 2026 మార్చి నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో కొన్ని సంయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు, సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. అలాగే శని, సూర్య, శుక్రుల మధ్య కూడా శక్తివంతమైన సంయోగం ఏర్పడబోతోంది.
ప్రతి నెల కూడా ఏదో ఒక గ్రహ సంచారంలో మార్పు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు రెండు, మూడు గ్రహాల కలయిక కూడా జరుగుతుందని చూస్తూ ఉంటాం. మార్చి నెల కూడా రాబోతోంది. 2026 మార్చి నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో కొన్ని సంయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు, సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది.

అలాగే శని, సూర్య, శుక్రుల మధ్య కూడా శక్తివంతమైన సంయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ సంయోగాలు ముఖ్యమైన మార్పులను తీసుకువస్తాయి. మార్చి నెలలో సూర్య, శని, శుక్రుల సంయోగం మీన రాశిలో జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.
శుక్ర, సూర్య, శని కలయిక
2026 మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీనరాశిలో శని సంచారం జరుగుతోంది. కాబట్టి మూడు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ కలయిక ఏర్పడడం విశేషం. అదే విధంగా సూర్య, శుక్రుల కలయికతో శుక్రాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. మరి మార్చిలో ఈ మూడు ప్రధాన గ్రహాల సంయోగంతో ఏ రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం.
మూడు గ్రహాల శక్తివంతమైన కలయికతో ఈ రాశులకు బోలెడు లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి మార్చి నెలలో బాగా కలిసి రాబోతోంది. ఈ మూడు పెద్ద గ్రహాల సంయోగంతో ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుత సమయం.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. పని ప్రదేశంలో ఒత్తిడి కూడా కాస్త ఎక్కువవచ్చు. జీవిత భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వస్తుంది.
3.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఇది మంచి సమయం. అదృష్టం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కెరీర్‌లో కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో బంధం దృఢంగా మారుతుంది.
4.మకర రాశి:
మకర రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ మూడు గ్రహాల సంయోగంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. టెన్షన్లు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


