జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై బలంగా ఉంటుంది. తాజాగా జూన్ 11, 2026న శుక్రుడు పుష్యమి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. పుష్యమి నక్షత్రం నక్షత్రాలన్నింటిలోనూ అత్యంత శుభప్రదమైంది. దీనికి అధిపతి శని దేవుడు.

సంపదను ఇచ్చే శుక్రుడు, కర్మఫల ప్రదాత అయిన శని పాలించే నక్షత్రంలోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో వీరికి అర్థికంగా, వృత్తిపరంగా ఎదురుండదని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.
సూర్య నక్షత్ర మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు.
మీ మాట తీరు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాకుండా, పొదుపు చేయడానికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కెరీర్‌లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇక పెళ్లికాని వారికి ప్రేమ చిగురించే అవకాశం ఉంది. దంపతులు ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా గడుపుతారు.
2.మిథున రాశి
మిథున రాశి వారికి అదృష్టం తలుపు తట్టే రోజులు మొదలయ్యాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కలగవచ్చు. ఊహించని విధంగా ధన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి.
3.కర్కాటక రాశి
{{/usCountry}}కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కలగవచ్చు. ఊహించని విధంగా ధన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి.
3.కర్కాటక రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు పదోన్నతి లభించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీరు కలగన్న ఒక పెద్ద కోరిక ఈ కాలంలో నెరవేరవచ్చు.
4.మకర రాశి
మకర రాశి వారికి, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అకస్మాత్తుగా ధనం వచ్చే అవకాశం ఉండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ప్రభావితం చేస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలను తెచ్చిపెట్టే డీల్స్ కుదురుతాయి. ఆర్ధికంగా ఎటువంటి లోటు లేకుండా సాగిపోతారు.
గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు గ్రహాల సంచారం, నక్షత్ర స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహ బలాలను బట్టి ఈ ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. సరైన నిర్ణయాల కోసం నిపుణులను సంప్రదించగలరు.