జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని సుఖ సంతోషాలు, విలాసాలు, శృంగారం, సంపదలకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం రాజభోగాలతో తులతూగుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న శుక్రుడు త్వరలోనే తన మిత్రుడైన బుధుడి సొంత రాశి అయిన మిథునంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

హిందూ పంచాంగం లెక్కల ప్రకారం.. 2026 మే 14వ తేదీ ఉదయం 10 గంటల 58 నిమిషాలకు శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 8వ తేదీ వరకు అక్కడే కొలువుదీరుతాడు. బుధుడు మేధస్సుకు చిహ్నమైతే, శుక్రుడు అందం, ఆకర్షణకు ప్రతిరూపం. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
శుక్రుడి రాశి మార్పు.. ఈ రాశులకు బోలెడు లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ కాలం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్, రైటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి తిరుగుండదు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తోబుట్టువులతో ఉన్న మనస్పర్థలు తొలగి సంబంధాలు బలపడతాయి. మనసుకు ప్రశాంతతను ఇచ్చే చిన్నపాటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
2.మిథున రాశి:
శుక్రుడు మీ సొంత రాశిలోనే సంచరిస్తుండటం వల్ల మీ వ్యక్తిత్వంలో కొత్త మెరుపు వస్తుంది. మీరు అందరినీ ఇట్టే ఆకర్షించగలరు. ఒంటరిగా ఉన్న వారికి ఈ సమయంలో తమకు నచ్చిన భాగస్వామి దొరికే అవకాశం ఉంది. మీ కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త బట్టలు, గ్యాడ్జెట్లు కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం.
3.సింహ రాశి:
సింహ రాశి జాతకులకు ఈ శుక్ర సంచారం లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో మొండిబకాయిలుగా మిగిలిపోయిన డబ్బు చేతికి అందుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ చిరకాల కోరిక నెరవేరే అవకాశం పుష్కలంగా ఉంది.
4.కన్య రాశి:
{{/usCountry}}సింహ రాశి జాతకులకు ఈ శుక్ర సంచారం లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో మొండిబకాయిలుగా మిగిలిపోయిన డబ్బు చేతికి అందుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ చిరకాల కోరిక నెరవేరే అవకాశం పుష్కలంగా ఉంది.
4.కన్య రాశి:
{{/usCountry}}ఉద్యోగస్తులకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఆఫీసులో ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీలోని సృజనాత్మకతను బాస్ గుర్తిస్తారు. పదోన్నతులు లేదా జీతాల పెంపు ఉండవచ్చు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పనికి, విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తారు.
5.కుంభ రాశి:
కుంభ రాశి వారి జీవితంలో శృంగారం, సృజనాత్మకత వెల్లివిరుస్తాయి. కళలు, సంగీతం లేదా డిజైనింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఎంతో లాభిస్తుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
శుక్రుడి అనుగ్రహం కోసం ఇలా చేయండి:
- మీ రాశి పైన పేర్కొన్న జాబితాలో లేకపోయినా.. శుక్రుడి శుభ ఫలితాలు పొందడానికి ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. శుక్రుడికి అపరిశుభ్రత అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మీ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.
- మంచి సుగంధ పరిమళాలను (పర్ఫ్యూమ్స్) ఉపయోగించడం వల్ల శుక్రుడు ప్రసన్నుడవుతాడు.
- మహిళలను గౌరవించండి. స్త్రీలు శక్తి స్వరూపాలు కాబట్టి, వారిని గౌరవించే చోట శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు.
- శుక్రవారం నాడు తెలుపు రంగు దుస్తులు ధరించడం లేదా పాలు, బియ్యం వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.