శుక్ర గోచారం 2026: నేటి నుంచి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది.. ఆ లక్కీ రాశులు ఇవే!
శుక్ర గోచారం 2026: మే 14 నుంచి శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 8 వరకు కొనసాగే ఈ సంచారం వల్ల మేష, మిథున, సింహ, కన్య, కుంభ రాశుల జాతకులకు ధనలాభంతో పాటు విలాసవంతమైన జీవితం లభిస్తుంది. ఆ లక్కీ రాశులు ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని సుఖ సంతోషాలు, విలాసాలు, శృంగారం, సంపదలకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం రాజభోగాలతో తులతూగుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న శుక్రుడు త్వరలోనే తన మిత్రుడైన బుధుడి సొంత రాశి అయిన మిథునంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

హిందూ పంచాంగం లెక్కల ప్రకారం.. 2026 మే 14వ తేదీ ఉదయం 10 గంటల 58 నిమిషాలకు శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 8వ తేదీ వరకు అక్కడే కొలువుదీరుతాడు. బుధుడు మేధస్సుకు చిహ్నమైతే, శుక్రుడు అందం, ఆకర్షణకు ప్రతిరూపం. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
శుక్రుడి రాశి మార్పు.. ఈ రాశులకు బోలెడు లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ కాలం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్, రైటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి తిరుగుండదు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తోబుట్టువులతో ఉన్న మనస్పర్థలు తొలగి సంబంధాలు బలపడతాయి. మనసుకు ప్రశాంతతను ఇచ్చే చిన్నపాటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
2.మిథున రాశి:
శుక్రుడు మీ సొంత రాశిలోనే సంచరిస్తుండటం వల్ల మీ వ్యక్తిత్వంలో కొత్త మెరుపు వస్తుంది. మీరు అందరినీ ఇట్టే ఆకర్షించగలరు. ఒంటరిగా ఉన్న వారికి ఈ సమయంలో తమకు నచ్చిన భాగస్వామి దొరికే అవకాశం ఉంది. మీ కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త బట్టలు, గ్యాడ్జెట్లు కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం.
3.సింహ రాశి:
సింహ రాశి జాతకులకు ఈ శుక్ర సంచారం లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో మొండిబకాయిలుగా మిగిలిపోయిన డబ్బు చేతికి అందుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ చిరకాల కోరిక నెరవేరే అవకాశం పుష్కలంగా ఉంది.
4.కన్య రాశి:
ఉద్యోగస్తులకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఆఫీసులో ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీలోని సృజనాత్మకతను బాస్ గుర్తిస్తారు. పదోన్నతులు లేదా జీతాల పెంపు ఉండవచ్చు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పనికి, విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తారు.
5.కుంభ రాశి:
కుంభ రాశి వారి జీవితంలో శృంగారం, సృజనాత్మకత వెల్లివిరుస్తాయి. కళలు, సంగీతం లేదా డిజైనింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఎంతో లాభిస్తుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
శుక్రుడి అనుగ్రహం కోసం ఇలా చేయండి:
- మీ రాశి పైన పేర్కొన్న జాబితాలో లేకపోయినా.. శుక్రుడి శుభ ఫలితాలు పొందడానికి ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. శుక్రుడికి అపరిశుభ్రత అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మీ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.
- మంచి సుగంధ పరిమళాలను (పర్ఫ్యూమ్స్) ఉపయోగించడం వల్ల శుక్రుడు ప్రసన్నుడవుతాడు.
- మహిళలను గౌరవించండి. స్త్రీలు శక్తి స్వరూపాలు కాబట్టి, వారిని గౌరవించే చోట శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు.
- శుక్రవారం నాడు తెలుపు రంగు దుస్తులు ధరించడం లేదా పాలు, బియ్యం వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


