విజయ దశమి పూజా విధానం.. ఆ రోజు శమీ పూజ ఎందుకు చేయాలి? చదువుకోవాల్సిన మంత్రం ఇదే
విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ రోజున అపరాజిత దేవిని పూజించడం, దుర్గాదేవికి దీపం వెలిగించి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే, శమీ వృక్ష పూజకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను మనం జరుపుకుంటాము. రాముడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

విజయ దశమి రోజు అపరాజిత దేవిని పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. మత విశ్వాసాల ప్రకారం, విజయదశమి నాడు అమ్మవారిని పూజిస్తే విజయం లభిస్తుందని నమ్మకం. అలాగే, ఏ పని ప్రారంభించినా అడ్డంకులు లేకుండా పరిపూర్ణంగా పూర్తవుతాయని విశ్వసిస్తారు. విజయదశమి నాడు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది.
విజయదశమి రోజు వీటిని పాటించండి
విజయదశమి రోజు స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి.
తర్వాత ఇంటి గుమ్మం దగ్గర పసుపు లేదా ఎరుపు రంగుతో స్వస్తిక్ గుర్తు వేయండి. దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహం వద్ద దీపం వెలిగించి, అగరబత్తులను కూడా వెలిగించండి. అక్షింతలు, కుంకుమ, వెరైటీ పూలు, కొబ్బరికాయ, పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించండి.
అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే, శమీ వృక్షాన్ని నాటండి. ఇలా చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.
దశమి తిథి ప్రారంభం: అక్టోబర్ 20 మధ్యాహ్నం 12:50 గంటలకు.
దశమి తిథి ముగింపు: అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11 గంటలకు.
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:59 నుంచి 2:45 వరకు.
రావణ దహనం: అక్టోబర్ 20 సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ప్రదోష కాలంలో రావణ దహనాన్ని నిర్వహించాలి.
విజయదశమి రోజు ముఖ్యంగా చేయాల్సిన శమీ పూజ
హిందూ సంప్రదాయంలో విజయదశమి నాడు శమీ వృక్షాన్ని పూజించడం విశేషమైనది. శమీ వృక్షాన్ని పూజిస్తే విజయం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
శమీ వృక్ష పూజ ఎందుకు చేయాలి?
పాండవుల అజ్ఞాతవాసంతో సంబంధం: మహాభారతం ప్రకారం చూసినట్లయితే, పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు ఆయుధాలను శమీ వృక్షంపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిశాక విజయదశమి నాడు ఆయుధాలను తిరిగి తెచ్చుకున్నారని నమ్ముతారు.
శమీ వృక్షాన్ని విజయదశమి నాడు ఎందుకు పూజించాలి?
విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శమీ వృక్షాన్ని విజయదశమి నాడు ఆరాధిస్తే జీవితంలో అడ్డంకులను అధిగమించి విజయాలను సొంతం చేసుకోవచ్చని నమ్ముతారు.
సుఖ సంతోషాలు, ఐశ్వర్యం: విజయ దశమి నాడు శమి పూజ చేయడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయి. అభివృద్ధి కూడా ఉంటుంది.
శని దోష నివారణ: ఈ వృక్షం శనిదేవుడికి చాలా ఇష్టమైనది. ఆ శమీ వృక్షాన్ని పూజిస్తే శని సంబంధిత బాధల నుంచి బయటపడవచ్చని విశ్వసిస్తారు.
ఈ పూజ చేసేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం:
శమీ శమయతే పాపం
శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ..
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


