...
...
Next Story

Vivaha Panchami: ఈరోజే వివాహ పంచమి.. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు, అవివాహితులకు కళ్యాణ భాగ్యం!

ఈరోజు శ్రీరాముడిని, సీతాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. ఉపవాసం, పూజతో పాటు కొన్ని పరిహారాలను పాటిస్తే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వివాహ పంచమి నాడు పూజ చేసి, ఉపవాసం ఉండి కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం మంచిది.

Published on: Nov 25, 2025, 09:14:22 IST
Advertisement

ప్రతీ ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి నాడు వివాహ పంచమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వివాహ పంచమి నవంబర్ 25, అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు శ్రీరాముడిని, సీతాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. ఉపవాసం, పూజతో పాటు కొన్ని పరిహారాలను పాటిస్తే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

ఈరోజే వివాహ పంచమి.. ఇలా చేస్తే చాలా మంచిది (pinterest)
ఈరోజే వివాహ పంచమి.. ఇలా చేస్తే చాలా మంచిది (pinterest)

చాలా మంది పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వివాహ పంచమినాడు పూజ చేసి, ఉపవాసం ఉండి కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం మంచిది. ఈరోజు వివాహ పంచమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.

ఈరోజే వివాహ పంచమి.. ఇలా చేస్తే చాలా మంచిది

  1. ఉదయాన్నే స్నానం చేసి ఆరాధించండి. అయితే స్నానం చేసేటప్పుడు నీటిలో గంగజలం కలిపి ఆ నీటితో స్నానం చేస్తే మంచిది.
  2. వివాహ పంచమి నాడు సీతా రాములను ఆరాధించి, రామ సీత కథను వినడం మంచిది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగి ఆనందంగా ఉండొచ్చు.
  3. తెలుపు లేదా పసుపు రంగు పూలను సమర్పించండి. అలాగే పసుపు, ధాన్యాలు, పండ్లు వంటి వాటిని సమర్పించండి.
  4. ఈరోజు అలంకరణ వస్తువులను ఎవరికైనా ఇవ్వడం మంచిది. గాజులు, తిలకం, దువ్విన చీర లేదా జాకెట్ ముక్క వంటి వాటిని ఇవ్వండి. అలా చేయడం వలన వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది, ఆనందం ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది.
  5. ఈరోజు రామచరితమానస్ చదవడం వలన కూడా చక్కటి ఫలితం ఉంటుంది.

వివాహ పంచమి నాడు ఈ పొరపాట్లు చేయకండి

  • సానుకూల శక్తి, సానుకూల ఆలోచనలతో మాత్రమే ఉండాలి.
  • ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్రలేవడం చేయకూడదు.
  • అబద్ధాలు చెప్పడం, ఇతరులను అవమానించడం, గొడవలు పడడం, తిట్టడం, పెద్దలను బాధ పెట్టడం చేయకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  • ఈరోజు శక్తికొద్దీ దానాలు చేయడం మంచిది. దానాలు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.
  • వివాహ పంచమినాడు ఉపవాసం ఉండేవారు.. సూర్యోదయం నుంచి ఉపవాసం ఉండాలి. ఏదైనా సాత్విక ఆహారం, పండ్లు తినవచ్చు. సీతారాముల మంత్రాలను పఠించి పూజ చేయాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks