...
...
Next Story

అధికమాసంలో వ్యతిపాత యోగం.. ఇది ప్రమాదకరమా? మే 27 నుంచి ఈ 3 రాశులకు ఇబ్బందు తప్పవా?

అధికమాసంలో వ్యతిపాత యోగం: అధికమాసంలో సూర్య చంద్రుల గమనం వల్ల అరుదైన వ్యతిపాత యోగం ఏర్పడుతోంది. మే 27 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు మీకోసం.

Published on: May 22, 2026, 12:30:19 IST
Advertisement

హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధికమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో అరుదుగా వచ్చే కొన్ని యోగాలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజాగా ఆకాశంలో సూర్య, చంద్రుల కలయికతో 'వ్యతిపాత యోగం' ఏర్పడుతోంది. మే 27వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ యోగం మే 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అసలు ఈ వ్యతిపాత యోగం అంటే ఏంటి? ఈ సమయంలో ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? నిపుణులు చెబుతున్న సూచనలేంటో ఇప్పుడు చూద్దాం.

వ్యతిపాత యోగం అంటే ఏమిటి?

అధికమాసంలో వ్యతిపాత యోగం.. ఇది ప్రమాదకరమా? మే 27 నుంచి ఈ 3 రాశులకు ఇబ్బందు తప్పవా?
అధికమాసంలో వ్యతిపాత యోగం.. ఇది ప్రమాదకరమా? మే 27 నుంచి ఈ 3 రాశులకు ఇబ్బందు తప్పవా?

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, సూర్య చంద్రులు ఒకరికొకరు సరిగ్గా 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో విశ్వంలో గ్రహాల శక్తి (Cosmic Energy) చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వాతావరణంలోనూ, మనుషుల మనస్తత్వాల్లోనూ కొంత ఉద్రిక్తత లేదా ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంటుంది.

వ్యతిపాత యోగం సమయంలో కొత్త పనులు ప్రారంభించడం అంత మంచిది కాదు. ఈ మూడు రోజులు మీరు చేసే సంప్రదాయ కార్యక్రమాలు లేదా ముఖ్యమైన పనులు కొంత ఆలస్యం కావచ్చు. అయితే, బాహ్య ప్రపంచం కంటే అంతర్గత విశ్లేషణకు ఇది సరైన సమయం. మీ ఆలోచనలను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చు.

ఈ రాశుల వారు అలర్ట్‌గా ఉండాల్సిందే

ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రహ గతులు సూచిస్తున్నాయి. ఆ రాశుల వివరాలు ఇవే:

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ సమయం కొంత గడ్డుకాలమనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకండి. మీరు తీసుకునే చిన్న పొరపాటు నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. ఏ విషయంలోనైనా తొందరపడకుండా, ఓపికతో ఆలోచించి అడుగు వేయడం మంచిది.

2.కన్యా రాశి:

సింహ రాశి వారికి కార్యాలయంలో తోటి ఉద్యోగులతో లేదా సీనియర్లతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద వివాదానికి దారి తీయవచ్చు. ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. అయితే, పని ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినకుండా చూసుకోవడం మీ బాధ్యత.

నిపుణుల సూచన

యోగం ఉన్న సమయంలో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ధ్యానం, దైవ ప్రార్థన వంటివి చేయడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఈ మూడు రోజులు కొత్త ఒప్పందాలు, భారీ పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు మరియు శాస్త్రాల ఆధారంగా రూపొందించినది మాత్రమే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులను సంప్రదించగలరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe