గ్రహాల అరుదైన కలయిక - ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం..! ఈ నిర్ణయాల్లో జాగ్రత్త

మే 15 వరకు సూర్యుడు, అంగారకుడు, బుధుడు ఒకే రాశిలో కొలువుదీరనున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా అద్భుత అవకాశాలు రానున్నాయి. 

Published on: May 13, 2026, 12:13:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sun Mars Mercury Conjunction : ఖగోళంలో ప్రస్తుతం ఒక అరుదైన గ్రహాల కలయిక (సంయోగం) చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు సూర్యుడు, అంగారక గ్రహం, మరియు బుధుడు కలిసి ఒకే రాశిలో సంచరించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు ప్రధాన గ్రహాల కలయిక అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అగ్ని తత్వానికి చిహ్నాలైన సూర్యుడు, అంగారకుడు కలవడం వల్ల సమాజంలో మరియు వ్యక్తులలో కొన్ని మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.

సూర్య, అంగారక, బుధ గ్రహాల అరుదైన కలయిక
సూర్య, అంగారక, బుధ గ్రహాల అరుదైన కలయిక

సూర్యుడు, అంగారకుడు ఇద్దరూ అగ్ని గ్రహాలే కావడం వల్ల ఈ సమయంలో ప్రజల్లో కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. మే 15 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఈ కాలంలో తీసుకునే పెద్ద నిర్ణయాలకు ఆశించిన స్థాయిలో ఆమోదం లభించకపోవచ్చు. ముఖ్యంగా వివాదాలకు, యుద్ధ వాతావరణానికి ఇది సరైన సమయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే…. మే 15న సూర్యుడు, బుధుడు కలిసి శుక్రుడి రాశిలోకి ప్రవేశించడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి.

కెరీర్‌లో కొత్త అవకాశాలు

ఈ గ్రహాల కలయిక కేవలం సవాళ్లను మాత్రమే కాదు…. అద్భుతమైన కెరీర్ అవకాశాలను కూడా తీసుకువస్తుంది. అంగారకుడు ధైర్యానికి, శక్తికి కారకుడైతే.. సూర్యుడు గౌరవానికి, కీర్తికి చిహ్నం. ఈ రెండు గ్రహాల శక్తి వల్ల మీరు మీ పరిమితులను అధిగమించి ముందుకు సాగే ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి… కొత్త సంబంధాలను నిర్మించుకోవడానికి ఇది మంచి సమయం.

ప్రయోజనం పొందే రాశులు ఇవే:

  • సింహ రాశి : సూర్యుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే… మనస్సులో దూకుడు పెరగకుండా చూసుకోవాలి. ఆవేశం దేనికీ పరిష్కారం కాదని గుర్తించి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి.
  • మిథున రాశి : సూర్యుని ఆత్మవిశ్వాసం, అంగారక శక్తి మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కెరీర్‌లో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార ఆలోచనలు విజయవంతం అవుతాయి. అయితే… కుటుంబంలో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది, ఓపికగా ఉండటం అవసరం.
  • ధనుస్సు రాశి : ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఈ గ్రహాల సంయోగం మీకు మేలు చేస్తుంది.

గ్రహాల ప్రభావం వల్ల మే 15 తర్వాత మరిన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంతవరకు ఆవేశానికి లోనుకాకుండా సంయమనంతో ఉండటం శ్రేయస్కరం.

గమనిక : ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు, మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More