చాలామంది మనం ఏ తప్పు చేయలేదు కదా అని అనుకుంటారు. తెలిసి చేసినా, తెలియక చేసినా అది తప్పే. తెలియకపోయినా తప్పులు చేయకూడదు. ఈరోజు బట్టలు ఉతకడానికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం.

జుట్టు కత్తిరించుకోవడానికి, గోళ్లు కత్తిరించుకోవడానికి, తలస్నానం చేయడానికి ఎలా అయితే ముఖ్యమైన రోజులు ఉన్నాయో, బట్టలు ఉతకడానికి కూడా కొన్ని నియమాలు పాటించాలి. బట్టలు కొన్ని రోజులు ఉతికితే శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని రోజులు బట్టలు ఉతకడం వలన నష్టాలు కలుగుతాయి.
మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఇంటి ఆర్థిక పరిస్థితులను, మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనుల గురించి మన పెద్దలు కూడా ఈ నియమాలను చెప్పేవారు. కేవలం మూఢనమ్మకంగా చూడొద్దు. దీని వెనక గ్రహాల ప్రభావం, శక్తి తరంగాల విశ్లేషణ ఉందని భావిస్తారు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం చూస్తే, బట్టలు ఏ రోజు ఉతకాలి? ఏ సమయంలో బట్టలు ఉతకాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ రోజుల్లో బట్టలు ఉతికితే శుభ ఫలితాలు కలుగుతాయి:
సోమవారం:
సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. నీటికి సంబంధించిన పనులు చేయడానికి సోమవారం చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. సోమవారం బట్టలు ఉతికితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
బుధవారం:
బుధవారం బుధ గ్రహానికి సంబంధించిన రోజు. బుధ గ్రహం వ్యాపారం, తెలివితేటలు వంటి వాటికి కారకుడు. బుధవారం నాడు బట్టలు ఉతకడం వలన ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
శుక్రవారం:
శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు బట్టలు శుభ్రంగా ఉంచుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారం ఉదయాన్నే బట్టలు ఉతికేసి ఇంటిని ధూపదీపాలతో అలంకరించుకోవాలి.
ఈ రోజుల్లో బట్టలు ఉతకడం మంచిది కాదు:
మంగళవారం:
మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు. కుజుడు అగ్ని తత్వానికి సంబంధించిన గ్రహం. అగ్ని తత్వమున్న రోజున నీటితో శుద్ధి చేసే పనులు, బట్టలు ఉతకడం వంటివి చేస్తే గ్రహదోషాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. దీంతో ఇంట్లో కలహాలు వంటివి ఏర్పడవచ్చు.
శనివారం:
{{/usCountry}}మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు. కుజుడు అగ్ని తత్వానికి సంబంధించిన గ్రహం. అగ్ని తత్వమున్న రోజున నీటితో శుద్ధి చేసే పనులు, బట్టలు ఉతకడం వంటివి చేస్తే గ్రహదోషాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. దీంతో ఇంట్లో కలహాలు వంటివి ఏర్పడవచ్చు.
శనివారం:
{{/usCountry}}శనివారం శని దేవుని ప్రభావం వలన బట్టలు ఉతకడం, కొత్త బట్టలు కొనడం మంచిది కాదు. పనుల్లో ఆటంకాలు వంటివి సంభవించే అవకాశాలు ఉంటాయి.
ఆదివారం:
ఆదివారం సూర్య భగవానుడి రోజు. ఆ రోజున విశ్రాంతి తీసుకోవాలి. బట్టలు ఉతకడం వంటి శ్రమతో కూడిన పనులు చేయొద్దు.
వారాలతో పాటు తిథులను కూడా గమనించండి
ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో బట్టలు ఉతకడం మంచిది కాదు. ఈ రోజులు ఆధ్యాత్మిక చింతనకు, దైవ ప్రార్థనకు ప్రత్యేకంగా కేటాయించినవి. ఈ పవిత్ర దినాల్లో మురికి బట్టలను నీళ్లలో నానబెట్టడం, ఉతకడం వంటివి చేయొద్దు. ఇవి పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గించే అవకాశం ఉందని భావిస్తారు.
సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా బట్టలు ఉతకద్దు. బట్టలను బయట ఆరవేయకూడదు. చీకటి పడ్డాక బట్టలు ఆరేస్తే ప్రతికూల ప్రభావాలతో బాధపడాల్సి ఉంటుందని పెద్దలు చెబుతారు.
మనము పాటించే ఆచారాలు శక్తి, గ్రహాలతో ముడిపడి ఉంటాయని నమ్మకం. కాబట్టి ఈ నియమాలను పాటిస్తే మంచిదని పెద్దలు అంటారు. ఈసారి ఈ చిన్న మార్పులు చేసి చూడండి. సానుకూల శక్తితో సంతోషంగా ఉండొచ్చు.