...
...
Next Story

Bhutha Shuddi Vivaham: భూతశుద్ధి వివాహం అంటే ఏంటి, ఈ ప్రక్రియలో ఎవరు పెళ్ళి చేసుకోవచ్చు? ముహూర్తం చూసుకోవాలా?

పెళ్లి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్లిని జరుపుతూ ఉంటారు. తాళి కట్టడం, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ఇలా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాం. కానీ భూతశుద్ధి వివాహం గురించి మీకు తెలుసా? భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? సమంత ఈ విధానంలోనే పెళ్లి చేసుకున్నారు.

Published on: Dec 3, 2025, 13:30:12 IST
Advertisement

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనది. పెళ్లితో రెండు మనసులు దగ్గరవుతాయి, రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. పెళ్లి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్లిని జరుపుతూ ఉంటారు. తాళి కట్టడం, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ఇలా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాం. కానీ భూతశుద్ధి వివాహం గురించి మీకు తెలుసా? భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? సమంత ఈ విధానంలోనే పెళ్లి చేసుకున్నారు. అసలు ఈ వివాహ ప్రక్రియ ఎలా ఉంటుంది? అసలు భూతశుద్ధి వివాహం వలన ఏమవుతుంది వంటి విషయాలను తెలుసుకుందాం.

భూతశుద్ధి వివాహం అంటే ఏంటి?

Bhutha Shuddi Vivaham: భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? (pinterest)
Bhutha Shuddi Vivaham: భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? (pinterest)

భూత అంటే పంచభూతాలు, శుద్ధి అంటే శుద్ధి చేయడం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలను శుద్ధి చేయడం. దంపతులు శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి మానసిక, భౌతిక బంధాన్ని ఈ వివాహ ప్రక్రియ బలోపేతం చేస్తుందని నమ్ముతారు.

ఇది చాలా పురాతన వివాహ ఆచారం. యోగ సంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్లుగా ఈ వివాహ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ వివాహాలను తమిళనాడు కోయంబత్తూర్‌లో ఉన్న సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్‌లో నిర్వహిస్తున్నారు. భార్య, భర్తల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ వివాహ ప్రక్రియను పాటిస్తూ ఉంటారు. ఈషా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవి ఆలయాల్లో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహంతో ఏకమవుతారు. ఈ ప్రక్రియను భూతశుద్ధి వివాహమని అంటారు. మామూలుగా హిందూ సాంప్రదాయంలో మంత్రోచ్ఛారణతో ఎలా అయితే వివాహాన్ని జరుపుతారో, అలాగే మంత్రోచ్ఛారణ ఉంటుంది.

అలాగే వధూవరుల ఇద్దరి శరీరం, మనసు, జీవశక్తి స్థాయిలను ఏకం చేసే యోగ క్రతువులు కూడా ఉంటాయి. ఇదే ప్రక్రియలో చాలామంది పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఒకటైన సమంత, రాజ్ కూడా ఈ భూతశుద్ధి వివాహ విధానంలోనే ఒకటయ్యారు. ఇలా వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు.

భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకుంటారు?

మామూలు పెళ్లిలా ఈ పెళ్లికి ముహూర్తాన్ని చూడరు. వరుడు, వధువు జాతకం ప్రకారం ముహూర్తం నిర్ణయిస్తారు. భూతశుద్ధి వివాహానికి ప్రత్యేకంగా ముహూర్తంతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ ప్రక్రియలో వివాహం చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ పెళ్లిళ్లు దసరా, నవరాత్రుల సమయంలో ప్రత్యేక రోజుల్లో జరుగుతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానంలో పెళ్లి చేసుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe