హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని అంటారు. ఈ సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుతారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ పండుగలను జరుపుతారు. అయితే ఈసారి ఈ సంక్రాంతి ఎప్పుడు వచ్చింది అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. మరి సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? సంక్రాంతి పండుగ తేదీలతో పాటు పుణ్యకాలం, శుభ ముహూర్తాల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం

మన భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి కూడా కలిసి రావడం జరిగింది.
మకర సంక్రాంతి 2026
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుంటారు. కేవలం ఇది మతపరమైనదే కాదు, రైతులకు పంట చేతికి వచ్చి ఆనందాన్ని తీసుకువచ్చే సమయం. ఈ పండుగకు అందమైన ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, గాలిపటాలను ఎగరవేయడం, భోగి పండ్లు, భోగి మంటలు వంటి ఎన్నో చూడొచ్చు.
నువ్వులు, బెల్లం కలిపి చేసే వంటకాలు కూడా ఈ సమయంలో తింటే మంచిదని, ఆరోగ్యంగా ఉండొచ్చని నమ్ముతారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ఈ సమయంలో దానధర్మాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి ఫలితాలను చూడవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఉత్తమ ఫలితాలను పొందడానికి కూడా వీలవుతుంది.
2026 సంక్రాంతి పండుగ తేదీలు
జనవరి 14, భోగి పండుగ
భోగి నాడు భోగి మంటలు వేస్తారు. పాత సామాగ్రిని మంటల్లో వేసే సాంప్రదాయం ఉంది. ఇలా చేయడం వలన పాత వాటిని వదిలి కొత్త వెలుగులతో పండుగను జరుపుకుంటాము.
జనవరి 15, మకర సంక్రాంతి
{{/usCountry}}భోగి నాడు భోగి మంటలు వేస్తారు. పాత సామాగ్రిని మంటల్లో వేసే సాంప్రదాయం ఉంది. ఇలా చేయడం వలన పాత వాటిని వదిలి కొత్త వెలుగులతో పండుగను జరుపుకుంటాము.
జనవరి 15, మకర సంక్రాంతి
{{/usCountry}}సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్లతో సరదాగా పండుగను జరుపుకుంటారు. పిల్లాపాపలతో, పిండి వంటలతో సంతోషంగా జరుపుకుంటారు.
జనవరి 16, కనుమ పండుగ
కనుమ పండుగ నాడు పశువులను ఆరాధిస్తారు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు.
సంక్రాంతి 2026 పుణ్యస్నానాలు, పూజా సమయం
పంచాంగం ప్రకారం చూసినట్లయితే, జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి మధ్యాహ్నం 3:13కి ప్రవేశించడంతో పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 5:45 వరకు ఉంటుంది.
మహా పుణ్యకాలం ఎంతో శ్రేష్టమైనది కనుక ఈ సమయంలో వీటిని పాటించడం మంచిది
మహా పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది. నది స్నానాలు, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, దానధర్మాలు వంటి కార్యక్రమాలు ఈ సమయంలో చెయ్యాలి.