...
...
Next Story

Subrahmanya Sashti 2025: సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 25న, 26న? తేదీతో పాటు సంతాన భాగ్యం కలగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి

ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్ల పక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకుంటాము. ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్టిని మనం జరుపుకుంటాము.

Published on: Nov 22, 2025, 15:00:03 IST
Advertisement

ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్ల పక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకుంటాము. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్టిని మనం జరుపుకుంటాము.

Subrahmanya Sashti 2025: సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 25న, 26న?
Subrahmanya Sashti 2025: సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 25న, 26న?

ఆ రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తీరుతాయని, సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు.అయితే, ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు వచ్చింది?

షష్టి తిధి నవంబర్ 25 రాత్రి 7:12కి ప్రారంభమవుతుంది. నవంబర్ 26 రాత్రి 7:43కి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకోవాలి. పంచమి నాడు ఉపవాసం ఉండి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి. అలాగే జ్ఞానం, బుద్ధి వృద్ధి కూడా పొందవచ్చు. కుజ దోషాలు ఉన్న వారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని షష్టి నాడు ఆరాధిస్తే మంచిది.

సుబ్రహ్మణ్య షష్టి నాడు ఏం చెయ్యాలి?

  • సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్య షష్టి నాడు ఈ విధంగా ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. సకల శుభాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామివారిని ఈ షష్టి రోజు పూజించడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
  • పూజ చేసిన తర్వాత పంచామృతం, పాయసం వంటి పాలతో చేసిన ప్రసాదాలను, వడపప్పు, చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి.
  • అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పూలు, పడగలను సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది. శక్తి, ధైర్యం పెరుగుతాయి.
  • సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకించి ఆరాధించాలి.
  • పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహువు, కేతువు దోషాల నుంచి బయటపడవచ్చు.
  • వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి.
  • సంతానం కలగాలని కోరుకునే వారు ఈ రోజు స్వామివారికి పాలు, తేనె, పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయాలి. అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. కొందరు నాగుల చీర కూడా కడతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe