వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ ఏ దిశలో ఉంటే మంచిది? ఈ తప్పులు చెయ్యద్దు!
ఇంటి ప్రధాన ద్వారం వద్ద నేమ్ ప్లేట్ ఏర్పాటు చేసేటప్పుడు వాస్తు నియమాలను పాటించడం శుభప్రదమని నమ్ముతారు. ప్రధాన ద్వారం కుడివైపున, కంటి స్థాయికి దగ్గరగా, సులభంగా కనిపించేలా నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇంటిని గుర్తించడానికి కాదు, ఇంటి అందాన్ని కూడా నేమ్ ప్లేట్ పెంచుతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వస్తుంది. వాస్తు ప్రకారం నేమ్ ప్లేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, దాని పరిమాణం, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ ఏ దిశలో ఉంటే మంచిది?
వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం కుడివైపున నేమ్ ప్లేట్ పెట్టడం మంచిది. దీనిని శుభప్రదంగా భావిస్తారు. సులువుగా కనిపించే ప్రదేశంలో నేమ్ ప్లేట్ పెట్టడం మంచిది. నేమ్ ప్లేట్ మరీ కిందకు లేదా నేలకు దగ్గరగా ఉండకూడదు. కంటి స్థాయికి దగ్గరగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి.
పరిమాణం ఎలా ఉంటే మంచిది?
నేమ్ ప్లేట్ కోసం దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. వాస్తు ప్రకారం చాలా అసమానంగా, వంకరగా లేదా క్లిష్టమైన డిజైన్లతో ఉండే నేమ్ ప్లేట్స్‌ని పెట్టడం మంచిది కాదు. సరళంగా, శుభ్రంగా ఉండే డిజైన్స్‌ని ఎంపిక చేసుకోండి.
ఏ దిశలో నేమ్ ప్లేట్ ఉండాలి?
తూర్పు దిశ: తూర్పు వైపు ఉన్నవాళ్లకు చెక్కతో తయారు చేసిన ప్లేట్ మంచిది. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది.
ఉత్తర దిశ: ఉత్తరం వైపు ఇల్లు ఉన్నట్లయితే, అలాంటి ఇళ్లకు మెటల్ నేమ్ ప్లేట్ అనుకూలంగా ఉంటుంది.
దక్షిణ దిశ: దక్షిణ దిశలో ప్రవేశ ద్వారం ఉన్నట్లయితే, నేమ్ ప్లేట్‌ని ఎంచుకునేటప్పుడు ఇంటి మొత్తం వాస్తుని పరిగణలోకి తీసుకుని నేమ్ ప్లేట్‌ని ఎంచుకోండి.
నేమ్ ప్లేట్ ఏ రంగులో ఉంటే మంచిది?
లైట్ కలర్స్‌ని ప్రిఫర్ చేయండి. తెలుపు, లైట్ పసుపు, గ్రీన్ వంటివి అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. ముదురు రంగులను ఉపయోగించొద్దు.
నేమ్ ప్లేట్ విషయంలో ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
నేమ్ ప్లేట్ స్పష్టంగా, ప్రత్యేకంగా కనిపించేలా తయారు చేయించండి. పగిలిపోయిన, విరిగిన లేదా తుప్పుపట్టిన నేమ్ ప్లేట్స్ ని మాత్రం తొలగించాలి.
నేమ్ ప్లేట్ పైన ఉన్న పేరు సులభంగా చదివే విధంగా ఉండాలని గుర్తు పెట్టుకోండి.
అలాగే ప్రధాన ద్వారం వద్ద తగినంత లైటింగ్ ఉండాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


