...
...
Next Story

బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి, ఏ రాశులకు బంగారం అదృష్టాన్ని తెస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ లోహమైనా, రత్నమైనా సరైన విధంగా ధరిస్తే చక్కటి ఫలితాలను పొందడానికి వీలవుతుంది. తప్పుగా ధరిస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బంగారం ఉంగరాన్ని ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? బంగారం ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిది? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

Published on: Jan 8, 2026, 12:00:28 IST
Advertisement

చాలా మంది ఈ చేతికి ఉంగరాలను ధరిస్తారు. ఖరీదైన బంగారు ఉంగరాలను కూడా చాలా మంది ధరిస్తారు. బంగారం విలువైన లోహం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ఎంతో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. బంగారు ఉంగరాన్ని ధరించడం వలన ధనం, అదృష్టం, విజయాలు కలుగుతాయి.

బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి, ఏ రాశులకు బంగారం అదృష్టాన్ని తెస్తుంది? (Pixabay)
బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి, ఏ రాశులకు బంగారం అదృష్టాన్ని తెస్తుంది? (Pixabay)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ లోహమైనా, రత్నమైనా సరైన విధంగా ధరిస్తే చక్కటి ఫలితాలను పొందడానికి వీలవుతుంది. తప్పుగా ధరిస్తే మాత్రం ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బంగారం ఉంగరాన్ని ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? బంగారం ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిది? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

బంగారంతో గ్రహాల సంబంధం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే బంగారానికి గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. బంగారాన్ని ధరించడం వలన జాతకంలో గురుగ్రహం బలపడుతుంది. గురు గ్రహం బలపడడం వలన ధనం, శుభం, సుఖసమృద్ధి కలుగుతాయి. జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే బంగారం సూర్య గ్రహాన్ని బలపరుస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, శక్తిని సూర్యుడు సూచిస్తాడు.

జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి, శక్తి లభిస్తుంది. అలాగే బంగారాన్ని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు. బంగారాన్ని ధరించడం వలన ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, సానుకూల శక్తి పెరుగుతాయని అంటారు. అయితే కొన్ని రాశుల వారికి బంగారం బాగా కలిసి వస్తుంది. కొన్ని రాశుల వారికి మాత్రం బంగారం అంతగా కలిసి రాదు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ రాశులకు బంగారం అనుకూలం

మకర రాశి, మిథున రాశి, కుంభ రాశి, వృషభ రాశి వారికి బంగారం అంతగా అనుకూలం కాదు. అయితే బంగారాన్ని ధరించేటప్పుడు జాతకంలో గురుగ్రహ స్థితిని చూసిన తర్వాతే ధరించాలి. అలాగే జ్యోతిష్య నిపుణులను సంప్రదించి ధరించడం మంచిది.

బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిది?

  • బంగారు ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధరిస్తే మంచిది. బంగారం ఉంగరాన్ని ఈ వేలుకు ధరించడం వలన అభివృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి, దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
  • అయితే కొన్ని సందర్భాల్లో చిటికెన వేలుకు ధరిస్తే కూడా శుభప్రదమే.
  • మధ్య వేలుకు మాత్రం బంగారు ఉంగరాన్ని పెట్టుకోకూడదు. అలా చేస్తే ధన నష్టం, ఆటంకాలు, ప్రతికూల ఫలితాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
  • బొటన వేలు చంద్రగ్రహానికి ప్రతీక. కాబట్టి బంగారు ఉంగరాన్ని బొటన వేలుకు కూడా పెట్టుకోకూడదు.

బంగారాన్ని ఎప్పుడు ధరించాలి?

ఆదివారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో బంగారు ఉంగరాన్ని ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహానికి సంబంధించిన గురువారం కూడా బంగారాన్ని ధరించడానికి ఉత్తమమైన రోజు.

బంగారాన్ని ఎలా ధరించాలి?

గంగాజలం, పాలు, తేనెతో బంగారాన్ని శుద్ధి చేసి, విష్ణుమూర్తి వద్ద పెట్టి, పూజ చేసి ధరించాలి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు పొందడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe