హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మానవ జీవితంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత లభించడానికి అనేక రకాల పరిహారాలు, పూజా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన తిథులు, నక్షత్రాలు, వారాలు కలిసి వచ్చే పర్వదినాల్లో చేసే పూజలకు, దానాలకు వంద రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతుంటారు.

అధికమాసం ముగింపు దశకు చేరుకుంది. ఈ అధికమాసపు చివరి రోజు అనగా జూన్ 15వ తేదీన అత్యంత పవిత్రమైన, అరుదైన సోమవాతి అమావాస్య(Somavati Amavasya) వచ్చింది. సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవాతి అమావాస్య అంటారు. ఈ రోజున చేసే ధార్మిక కార్యక్రమాలు, స్నానాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి.
పంచాంగ గణన ప్రకారం, ఈ ఏడాది అధికమాసం సోమవారంతో ముగుస్తుండటం, అదే రోజు అమావాస్య తిథి ఉండటం వల్ల విశ్వంలో ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తెలిసి లేదా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి, పితృదేవతల ఆశీస్సులు లభించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైనది.
ఉత్తరాఖండ్‌లోని పశ్చిమ హిమాలయాలలో ఉన్న గంగోత్రి హిమానీనదం(గోముఖ్)లో జన్మించి అందమైన పర్వత శ్రేణుల గుండా ప్రవహించే పవిత్ర గంగానది.. మొట్టమొదటిసారిగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే పుణ్యక్షేత్రం హరిద్వార్. బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన స్థలమని, క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత బిందువులు ఇక్కడ పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గంగానదికి, హరిద్వార్ క్షేత్రానికి హిందూమతంలో అత్యున్నత స్థానం ఉంది.
సోమవతి అమావాస్య వంటి మహా పర్వదినాల్లో సాక్షాత్తూ ముక్కోటి దేవతలు, దివ్య పురుషులు బ్రహ్మముహూర్తంలో హరిద్వార్‌లోని హర్ కి పౌరిలో ఉన్న బ్రహ్మ కుండ్ ఘాట్ వద్ద గంగానదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. దేవతల స్పర్శ వల్ల ఆ సమయంలో అక్కడి గంగాజలం అమృతంగా మారుతుందని ప్రతీతి. అందువల్ల మీరు ఈ రోజున హరిద్వార్‌లోని గంగానదిలో స్నానం చేస్తే, మీ పాపాలన్నీ పోతాయని నమ్మకం.
{{/usCountry}}సోమవతి అమావాస్య వంటి మహా పర్వదినాల్లో సాక్షాత్తూ ముక్కోటి దేవతలు, దివ్య పురుషులు బ్రహ్మముహూర్తంలో హరిద్వార్‌లోని హర్ కి పౌరిలో ఉన్న బ్రహ్మ కుండ్ ఘాట్ వద్ద గంగానదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. దేవతల స్పర్శ వల్ల ఆ సమయంలో అక్కడి గంగాజలం అమృతంగా మారుతుందని ప్రతీతి. అందువల్ల మీరు ఈ రోజున హరిద్వార్‌లోని గంగానదిలో స్నానం చేస్తే, మీ పాపాలన్నీ పోతాయని నమ్మకం.
{{/usCountry}}సాధ్యమైతే సోమవతి అమవాస్యనాడు హరిద్వార్‌లో గంగా నదిలో స్నానం చేయాలి. ఒకవేళ హరిద్వార్ వెళ్లడం కుదరకపోతే, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, పితృ తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది.