అరుదైన సోమవతి అమావాస్య.. ఈ ఒక్క పనితో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పటాపంచలు!

అధిక మాసంలో వచ్చిన సోమవతి అమవాస్య చాలా పవర్‌ఫుల్ అని నమ్మకం. అలాంటి రోజున మీరు చేసే ఒక్క పనితో తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

Published on: Jun 14, 2026, 17:20:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మానవ జీవితంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత లభించడానికి అనేక రకాల పరిహారాలు, పూజా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన తిథులు, నక్షత్రాలు, వారాలు కలిసి వచ్చే పర్వదినాల్లో చేసే పూజలకు, దానాలకు వంద రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతుంటారు.

సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పని
సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పని

అధికమాసం ముగింపు దశకు చేరుకుంది. ఈ అధికమాసపు చివరి రోజు అనగా జూన్ 15వ తేదీన అత్యంత పవిత్రమైన, అరుదైన సోమవాతి అమావాస్య(Somavati Amavasya) వచ్చింది. సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవాతి అమావాస్య అంటారు. ఈ రోజున చేసే ధార్మిక కార్యక్రమాలు, స్నానాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి.

పంచాంగ గణన ప్రకారం, ఈ ఏడాది అధికమాసం సోమవారంతో ముగుస్తుండటం, అదే రోజు అమావాస్య తిథి ఉండటం వల్ల విశ్వంలో ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తెలిసి లేదా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి, పితృదేవతల ఆశీస్సులు లభించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైనది.

ఉత్తరాఖండ్‌లోని పశ్చిమ హిమాలయాలలో ఉన్న గంగోత్రి హిమానీనదం(గోముఖ్‌)లో జన్మించి అందమైన పర్వత శ్రేణుల గుండా ప్రవహించే పవిత్ర గంగానది.. మొట్టమొదటిసారిగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే పుణ్యక్షేత్రం హరిద్వార్. బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన స్థలమని, క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత బిందువులు ఇక్కడ పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గంగానదికి, హరిద్వార్ క్షేత్రానికి హిందూమతంలో అత్యున్నత స్థానం ఉంది.

సోమవతి అమావాస్య వంటి మహా పర్వదినాల్లో సాక్షాత్తూ ముక్కోటి దేవతలు, దివ్య పురుషులు బ్రహ్మముహూర్తంలో హరిద్వార్‌లోని హర్ కి పౌరిలో ఉన్న బ్రహ్మ కుండ్ ఘాట్ వద్ద గంగానదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. దేవతల స్పర్శ వల్ల ఆ సమయంలో అక్కడి గంగాజలం అమృతంగా మారుతుందని ప్రతీతి. అందువల్ల మీరు ఈ రోజున హరిద్వార్‌లోని గంగానదిలో స్నానం చేస్తే, మీ పాపాలన్నీ పోతాయని నమ్మకం.

సాధ్యమైతే సోమవతి అమవాస్యనాడు హరిద్వార్‌లో గంగా నదిలో స్నానం చేయాలి. ఒకవేళ హరిద్వార్ వెళ్లడం కుదరకపోతే, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, పితృ తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More