ఈ మాసంలో వచ్చే యోగినీ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. సకల పాపాలను హరిస్తూ, మోక్ష మార్గాన్ని సుగమం చేసే ఈ ఏకాదశి విశిష్టత, తిథి, మరియు జూలై నెలలో రాబోయే మరో ముఖ్యమైన ఏకాదశి గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి అత్యంత పవిత్రమైన విలువ ఉంది. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. జ్యేష్ఠ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'యోగిని ఏకాదశి' అని పిలుస్తారు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు ఈ ఏకాదశి ఒక నావలాంటిదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శివ భక్తుడైన కుబేరుడి కథతో ఈ ఏకాదశికి విడదీయలేని అనుబంధం ఉంది.
యోగినీ ఏకాదశి 2026: తేదీ మరియు ముహూర్తం
ఈ ఏడాది యోగిని ఏకాదశి తిథి జూలై 9న సాయంత్రం 7 గంటల 46 నిమిషాలకు ప్రారంభమై, జూలై 10వ తేదీ సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా తీసుకుంటే, జూలై 10న యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం ఉత్తమం. గృహస్తులు జూలై 10న ఉపవాసం ఉండగా, సన్యాసులు, సాధువులు జూలై 11న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ ఏడాది ఏకాదశి నాడు భరణి నక్షత్రం ఉండటం విశేషం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాగా, ఇది జీవన మరణ రహస్యాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాకుండా, ఈ రోజు 'సుకృతి' యోగం కూడా ఉండటం వల్ల ఈ వ్రత ఫలితం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
వ్రత ప్రాముఖ్యత - ఫలశ్రుతి
ఈ ఏకాదశి వ్రతం చేయడం అంటే ఎన్నో యజ్ఞాలు చేసిన దానితో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. అజ్ఞాతంగా చేసిన పాపాలను సైతం తొలగించే శక్తి ఈ ఏకాదశికి ఉంది. ఈ రోజున శ్రీహరిని స్మరిస్తూ ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఏకాదశి అంటే కేవలం భోజనం మానేయడం మాత్రమే కాదు, ఇంద్రియ నిగ్రహంతో దైవ చింతనలో గడపడం.
జూలైలో మరో విశేషం: దేవశయని ఏకాదశి
{{/usCountry}}ఈ ఏకాదశి వ్రతం చేయడం అంటే ఎన్నో యజ్ఞాలు చేసిన దానితో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. అజ్ఞాతంగా చేసిన పాపాలను సైతం తొలగించే శక్తి ఈ ఏకాదశికి ఉంది. ఈ రోజున శ్రీహరిని స్మరిస్తూ ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఏకాదశి అంటే కేవలం భోజనం మానేయడం మాత్రమే కాదు, ఇంద్రియ నిగ్రహంతో దైవ చింతనలో గడపడం.
జూలైలో మరో విశేషం: దేవశయని ఏకాదశి
{{/usCountry}}ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'దేవశయని' లేదా 'హరిశయని' ఏకాదశి అంటారు. ఇది మోక్షాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున పద్మనాభుడైన శ్రీమన్నారాయణుడిని కమల పుష్పాలతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.
పురాణాల ప్రకారం, ఈ రోజు నుంచి క్షీరసాగరంలో శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తారు. వచ్చే కార్తీక ఏకాదశి వరకు ఆయన శేషతల్పంపైనే శయనిస్తారు. కాబట్టి, ఈ నాలుగు నెలల కాలాన్ని 'చాతుర్మాస్య దీక్ష'గా పరిగణించి, భక్తులు ధర్మబద్ధమైన ఆచరణను పాటిస్తారు. ఈ సమయంలో సాత్విక ఆహారం, దైవ ప్రార్థనలకు ప్రాధాన్యత ఇస్తారు.