...
...
Next Story

Yuti Drishti Yogam: సూర్య, బుధ గ్రహాల సంయోగంతో యుతి దృష్టి యోగం.. ఈ రాశులకు ధన వర్షం కురిసే అవకాశం!

గ్రహగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సూర్యుడు, బుధుడు కలిసి 'యుతి దృష్టి యోగాన్ని' ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అరుదైన యోగం వల్ల నాలుగు రాశుల వారికి అపారమైన ధనలాభం, కీర్తి ప్రతిష్టలు దక్కనున్నాయి. ఆ రాశులేంటో, మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి.

Published on: Jun 20, 2026, 11:01:14 IST
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతూ ఉంటుంది. ప్రధాన గ్రహాలైనటువంటి సూర్యుడు, బుధుడు సంయోగం చెందడంతో యుతి దృష్టి యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, బుధుడు పరస్పర మిత్ర గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకని ఈ రెండు గ్రహాల సంయోగంతో ఏర్పడే ఈ యుతి దృష్టి యోగం శుభప్రదమైనదిగా భావిస్తారు.

Yuti Drishti Yogam: సూర్యుడు, బుధుడు సంయోగంతో యుతి దృష్టి యోగం.. ఈ రాశులకు ధన వర్షం కురిసే అవకాశం! (pinterest)
Yuti Drishti Yogam: సూర్యుడు, బుధుడు సంయోగంతో యుతి దృష్టి యోగం.. ఈ రాశులకు ధన వర్షం కురిసే అవకాశం! (pinterest)

జూలై 13, సోమవారం ఉదయం 6:53కి సూర్యుడు, బుధుడు 0 డిగ్రీల దగ్గర సంయోగం చెందుతారు. దీంతో యుతి దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని గంటల పాటు ఉంటుంది. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ నాలుగు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు కలగడంతో పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

త్వరలోనే యుతి దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. తండ్రి సహకారంతో ఈ రాశి వారు పనుల్లో విజయాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇదే శుభ సమయం. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు.

2.కన్యా రాశి

ఈ యోగం మీ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారంలో కీలక ఒప్పందాలు కుదురుతాయి. పార్ట్‌నర్‌షిప్ బిజినెస్‌ల ద్వారా భారీగా లాభాలను పొందుతారు. ప్రభుత్వ సంబంధిత పెండింగ్ పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి.

3.సింహ రాశి

ఈ రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయాలను అందుకుంటారు. పెద్దల సహకారంతో సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ యోగం అనుకూలంగా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks