కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. జల్‌శక్తి మంత్రి కామెంట్స్

kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్​ పాటిల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Published on: Mar 30, 2026, 19:17:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్​ పాటిల్ కామెంట్స్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని బీఆర్ఎస్​ సభ్యుడు సురేశ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సురేష్‌ రెడ్డి సమాధానం ఇస్తూ.. కేంద్ర జల్‌శక్తి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

'కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం. రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి అనుమతుల కోసం కేంద్రం దగ్గరికి వచ్చారు. ప్రాజెక్టు లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు.' అని సీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు మీద ఎన్​ఎస్​డీఏ నివేదికను కూడా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలు కారణం అని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. కాళేశ్వరం లోపాల మీద కేంద్రబృందం అధ్యయనం చేస్తోందన్నారు. జల్‌జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదని తెలిపారు. తెలంగాణ దగ్గర జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లు ఉండగా.. మూడేళ్లలో రూ.194 కోట్లు ఖర్చు చేశారన్నారు.

మెుత్తానికి రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రణాళిక, రూపకల్పన లోపాల వల్లే ఈ ప్రాజెక్టు ఘోరంగా విఫలమైందన్నారు. రూ.1 లక్ష కోట్ల ప్రజాధనం పూర్తిగా వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కేంద్ర కమిటీ ఈ ప్రాజెక్టుపై విచారణ జరుపుతోందన్నారు.

రేవంత్ రెడ్డి కామెంట్స్

మరోవైపు కాళేశ్వరంపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడారు. గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించడంలో కేంద్రం విఫలమైందన్నారు. కాళేశ్వరం కుంభకోణం కేసులో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బదిలీ చేసిందని, దానివల్లే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది లోక్‌సభ సీట్లు గెలుచుకుందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ నిధులను దుర్వినియోగం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పలుమార్లు బహిరంగంగా ఆరోపించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అధికారికంగా అభ్యర్థిస్తే.. 48 గంటల్లోగా సీబీఐ విచారణకు ఆదేశించి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రేవంత్ ప్రస్తావించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More