తెలంగాణలో వచ్చే సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం.. కొత్త సంస్కరణలు
తెలంగాణలో విద్యా విధానంలో మార్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10 ప్లస్ 2 విధానాన్ని అమలు చేయనుంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు విధానానికి స్వస్తి పలుకుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయంలో బుధవారం నాడు విద్యాశాఖపై నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో సీఎం విద్యా సంస్కరణలపై కీలక దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మారుతున్న ఆధునిక అవసరాలు, సాంకేతిక పురోగతికి అనుగుణంగా తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం అనివార్యమని స్పష్టం చేశారు.
'రాష్ట్రంలోని ప్రతీ పేద విద్యార్థికి అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చే ఏ మార్పు కూడా ఏ ఒక్క విద్యార్థికి నష్టం కలిగించకూడదు.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నర్సరీ స్థాయి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల పునాదిని బలపరిచేలా పాఠ్యాంశాలు, మౌలిక సదుపాయాలు ఉండాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన సంస్కరణల్లో భాగంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించనున్నారు.
12వ తరగతి పూర్తిచేసే సమయానికి విద్యార్థుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలలు, డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లు, మౌలిక వసతులను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం(NEP 2020) ప్రకారం విద్యా రంగాన్ని పునర్వ్యవస్థీకరించే క్రమంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ 10+2 విధానానికి ప్రాధాన్యమిస్తోంది. పాఠశాల విద్యను, ఇంటర్మీడియట్ విద్యను విడివిడిగా చూడకుండా 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 10+2 విధానం అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, చట్టబద్ధమైన అనుమతులు, కరికులమ్ మార్పులపై నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


