శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 10 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.డిసెంబరు 13 నుంచి జనవరి 2 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన టికెట్లు ఇవాళ్టి (డిసెంబరు 3) నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.
- సిర్పూర్ కాగజ్ నగర్ - కొల్లాం మధ్య డిసెంబర్ 13వ తేదీన ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
- చర్లపల్లి - కొల్లాం జంక్షన్ మధ్య డిసెంబర్ 17, 31 తేదీల్లో ఒక్కో సర్వీస్ రాకపోకలు సాగిస్తాయి.
- చర్లపల్లి - కొల్లాం జంక్షన్ మధ్య డిసెంబర్ 20వ తేదీన మరో సర్వీస్ ఉంటుంది.
- హజూర్‌సాహిబ్ నాందేడ్ - కొల్లాం జంక్షన్ మధ్య డిసెంబర్ 24వ తేదీన ఒక సర్వీస్ ఉంటుంది.
- కొల్లాం జంక్షన్ - చర్లపల్లి మధ్య డిసెంబర్ 15వ తేదీన ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
- కొల్లాం జంక్షన్ - చర్లపల్లి మధ్య డిసెంబర్ 19, జనవరి 2 తేదీల్లో ఒక్కో సర్వీస్ రాకపోకలు సాగిస్తుంది.
- కొల్లాం జంక్షన్ - చర్లపల్లి మధ్య డిసెంబర్ 22, 26 తేదీల్లో ఒక్కో సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

రానుపోను కలిపి 10 ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లాం వెళ్లే ప్రత్యేక రైలుబెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లాం వెళుతుంది.
చర్లపల్లి నుంచి కొల్లాంకు వెళ్లే స్పెషన్ ట్రైన్…. సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి వికారాబాద్, తాండూరు మీదుగా గుంతకల్, చిత్తూరు, కాట్పాడి రూట్ మీదుగా వెళ్తుంది. హజూర్‌సాహిబ్ నాందేడ్-కొల్లం స్పెషల్ ట్రైన్… నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ, తిరుపతి, కొట్టాయం మీదుగా వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.