Trainee IPS Uday Krishna Reddy Case : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించి, ప్రాణాపాయ బెదిరింపులకు గురిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా…. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తీర్పు మేరకు పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా అసభ్యకరమైన, వేధింపులతో కూడిన సందేశాలు పంపుతూ ఉదయ్‌కృష్ణారెడ్డి తీవ్రంగా వేధించాడని బాధితురాలు తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అకాడమీలో తోటి స్నేహితుల ముందే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసిక నరకానికి గురిచేశాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా…. మరొక ట్రైనీ అధికారితో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశాడని, ఆ లేని సంబంధాన్ని అంగీకరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి నోటికొచ్చినట్లు దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
జూలై 9వ తేదీన అకాడమీలో తనను అడ్డుకున్న నిందితుడు… బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని ఫిర్యాదులో వెల్లడించారు. గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడమే కాకుండా…. మెడపై కత్తి ఉంచి భయాందోళనకు గురిచేసి గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడని తెలిపారు.
అనుమతి లేకుండా రహస్యంగా కొన్ని వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించినట్లు బాధితురాలు ఆరోపించారు. వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆ వీడియోలను ఆమె భర్తకు కూడా పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జులై 18న కేసు నమోదు…
బాధిత మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా…. అత్తాపూర్ పోలీసులు జూలై 18న కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మంగళవారం రోజు ఉదయ్‌కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు, తగిన ఆధారాలు లభించడంతో బుధవారం అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
కేసు నమోదు కాగానే నిందితుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనపై వచ్చిన ఫిర్యాదు, ఆరోపణలు కేవలం పుకార్లని, అవన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. అయితే లోతుగా విచారణ జరిపిన పోలీసులు ఆధారాలతో సహా అతడిని కోర్టులో హాజరుపరచగా…. ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
{{/usCountry}}కేసు నమోదు కాగానే నిందితుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనపై వచ్చిన ఫిర్యాదు, ఆరోపణలు కేవలం పుకార్లని, అవన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. అయితే లోతుగా విచారణ జరిపిన పోలీసులు ఆధారాలతో సహా అతడిని కోర్టులో హాజరుపరచగా…. ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
{{/usCountry}}ఈ కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అలాంటి ఉదయ్ కృష్ణారెడ్డి… ఎంతో కష్టపడి ఐపీఎస్ సాధించారు. ఇలాంటి క్రమంలో… అతనిపై కేసు నమోదు కావటం, అరెస్ట్ కావటం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.