హైకోర్టులో పిటిషన్ వేసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. బుధవారం విచారణ
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వేశారు.
కొన్ని రోజులుగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం(జులై 22) హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణ రెడ్డి అనే ఐపీఎస్ ట్రైనీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కొన్ని వారాలుగా నిందితుడు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్లు సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. జూన్ 23వ తేదీ నుండి ఈ వేధింపుల పర్వం మొదలైందని, రోజురోజుకూ నిందితుడి ప్రవర్తన మితిమీరిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు వాట్సాప్ ద్వారా తీవ్ర అసభ్యకరమైన, లైంగిక వేధింపులతో కూడిన సందేశాలను పంపేవాడు. అంతటితో ఆగకుండా, అకాడమీలోని ఇతర ట్రైనీల సమక్షంలో ఆమెను ఉద్దేశించి తెలుగులో అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసేవాడని తెలిపారు.
ఆ తర్వాత రోజు ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయన రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఉదయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో తనకు గత ఏడాది కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురై ఆయనను వెంటనే ఎస్‌ఆర్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, లేఖలోని అంశాలు నిజమేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఐపీఎస్ ట్రైనీ అధికారుల మధ్య ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


