భూ భారతి చలాన్ల కుంభకోణంలో కదులుతున్న డొంక - 15 మంది అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు

రాష్ట్రంలో భూ భారతి, ధరణి రిజిస్ట్రేషన్ల చలాన్ల వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు…15 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. 

Published on: Jan 17, 2026, 10:37:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూ భారతి, ధరణి రిజిస్ట్రేషన్లలోని అక్రమాల కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో వెలుగు చూసిన రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను వరంగల్ నగర సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

భూ భారతి రిజిస్ట్రేషన్లలో అక్రమాలు - 15 మంది అరెస్ట్
భూ భారతి రిజిస్ట్రేషన్లలో అక్రమాలు - 15 మంది అరెస్ట్

వరంగల్ సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం…. ఈ ముఠా సభ్యుల నుంచి 63.19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. , బ్యాంకులో ఉన్న 1 లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్స్, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్లలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు. పట్టుబడిన 15 మంది నిందితుల్లో ఒకడైన గణేష్ అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకుంటాడు. చెల్లించాల్సిన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుంచి మొత్తం డబ్బులను మీసేవా వ్యక్తుల ద్వారా వసూలు చేయిస్తాడు. వసూలు చేసిన డబ్బు నుంచి ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులతో పాటు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తాడు. ఈ- చలాన్లను ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు…. ధరణి/భూభారతీ వెబ్సైట్లో ఇన్స్ పెక్ట్ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ రుసుం తగ్గించేవాడు. ఆ తర్వాత చలాన్ ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.

ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ ను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించిన రశీదులను కూడా ఎడిట్ చేస్తున్నారు. మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తారు. నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారికి పది శాతం నుంచి 30శాతం వరకు కమీషన్ చెల్లించేవారు.

ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More