పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగినప్పటికీ, 2027 నైరుతి రుతుపవనాల సమయానికి దానికి పూర్తి విరుద్ధమైన లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS - ఇన్కాయిస్) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది భారత వ్యవసాయ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊరటనిచ్చే అంశం.

నవంబర్ 2026 - మార్చి 2027 వరకు బలమైన ఎల్ నినో పరిస్థితులు ఉంటాయి. ఏప్రిల్ 2027 - జూన్ 2027 తటస్థ పరిస్థితులు ఉండగా..వాతావరణ మార్పుల దశ మెుదలవుతుంది. జూన్ 2027 - ఆగస్టు 2027 నుండి లా నినా ఏర్పడే అవకాశం ఉంటుంది. 2027 నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉంటాయి.
కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ (MoES) ఆధ్వర్యంలో పనిచేసే ఇన్కాయిస్, ఎల్ నినో, లా నినా పరిస్థితులను ట్రాక్ చేసే 'నినో 3.4 సూచిక' పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మోడల్‌ను అభివృద్ధి చేసింది.
అక్టోబర్ 2026 నాటికి మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. సముద్ర అంతర్భాగంలో కూడా పలు ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం బలమైన ఎల్ నినోకు నిదర్శనం. నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు ఎల్ నినో కొనసాగడానికి 87-100 శాతం అవకాశం ఉంది.
సాధారణంగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఇది వ్యవసాయం, నీటి వనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ ఏడాది (2026) దేశంపై దీని ప్రభావం కనిపిస్తోంది. దీనికి పూర్తి విరుద్ధంగా, పసిఫిక్ మహాసముద్రం చల్లబడటాన్ని 'లా నినా' అంటారు. పసిఫిక్ నుండి వీచే చల్లని గాలులు భారత రుతుపవనాలను బలోపేతం చేస్తాయని ఇన్కాయిస్ సీనియర్ శాస్త్రవేత్త పి.ఎ. ఫ్రాన్సిస్ తెలిపారు. లా నినా సంవత్సరాల్లో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, అయితే దీని తీవ్రత ఏటా మారుతూ ఉంటుందని ఆయన వివరించారు.
{{/usCountry}}సాధారణంగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఇది వ్యవసాయం, నీటి వనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ ఏడాది (2026) దేశంపై దీని ప్రభావం కనిపిస్తోంది. దీనికి పూర్తి విరుద్ధంగా, పసిఫిక్ మహాసముద్రం చల్లబడటాన్ని 'లా నినా' అంటారు. పసిఫిక్ నుండి వీచే చల్లని గాలులు భారత రుతుపవనాలను బలోపేతం చేస్తాయని ఇన్కాయిస్ సీనియర్ శాస్త్రవేత్త పి.ఎ. ఫ్రాన్సిస్ తెలిపారు. లా నినా సంవత్సరాల్లో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, అయితే దీని తీవ్రత ఏటా మారుతూ ఉంటుందని ఆయన వివరించారు.
{{/usCountry}}ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే 2026లో సముద్రపు వేడిగాలులు తీవ్రంగా విస్తరించాయి. అక్టోబర్-నవంబర్ నెలల్లో అరేబియా సముద్రంలో దాదాపు 80-90 శాతం ప్రాంతం దీని ప్రభావానికి లోనైంది. బంగాళాఖాతంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల బంగాళాఖాతంలో భారీ అలలు పెరగడం, అరేబియా సముద్రంలో తగ్గడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.