హైదరాబాద్‌లోని జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రీమియం ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్‌నుఅధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక టాక్సీ సేవలు సంవత్సరం పొడవునా 24/7 అందుబాటులో ఉంటాయి. రద్దీ సమయాలు లేదా పండుగ రోజుల్లో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ప్రయాణ సమయాలకు అనుగుణంగా నిరంతర రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి.
ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని అందించడానికి సెడాన్లు, ఎస్‌యూవీలు కలిపి 200కు పైగా వాహనాలతో కూడిన ప్రత్యేక ఫ్లీట్‌ను కేటాయించారు. ఈ వాహనాలు కేవలం విమానాశ్రయ రవాణా సర్వీసుల కోసమే పనిచేస్తాయి. దీనివల్ల ప్రయాణికులకు సమయపాలన, కచ్చితమైన సేవలు అందుతాయి. విమానాశ్రయం లోపలికి వచ్చే ప్రయాణికులు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా మొబైల్ యాప్ లేదా బుకింగ్ కియోస్క్‌ల ద్వారా టాక్సీని బుక్ చేసుకుని, నిర్ణీత పికప్ బే వద్ద కేటాయించిన టాక్సీని ఎక్కవచ్చు.
ప్రస్తుతం ఈ ప్రీమియం సర్వీస్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించడానికి అందుబాటులో ఉంది. ఎయిర్‌పోర్ట్ నిర్దేశించిన కఠిన ప్రమాణాల ప్రకారం ఈ వాహనాలలో పరిశుభ్రత, నైర్మల్యాన్ని మెయింటెన్ చేస్తారు. శిక్షణ పొందిన, సర్టిఫైడ్ డ్రైవర్లు మాత్రమే ఈ వాహనాలను నడుపుతారు.
ఎయిర్‌పోర్ట్ ర్యాంప్‌ల వద్ద నిలిపి ఉంచే వాహనాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. దీనివల్ల ప్రయాణికుల భద్రత, సర్వీస్ క్రమశిక్షణ మరియు ప్రయాణ ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సిఈఓ కధిర్ కధిరవన్ మాట్లాడారు.
'మా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల్లో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే ప్రాథమిక లక్ష్యం. భద్రత, విశ్వసనీయత మరియు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రత్యేక ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించాం. 24/7 లభ్యత, ప్రీమియం వాహనాలు, ధృవీకరించబడిన డ్రైవర్లతో ఒత్తిడి లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం.' అని తెలిపారు.
{{/usCountry}}'మా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల్లో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే ప్రాథమిక లక్ష్యం. భద్రత, విశ్వసనీయత మరియు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రత్యేక ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించాం. 24/7 లభ్యత, ప్రీమియం వాహనాలు, ధృవీకరించబడిన డ్రైవర్లతో ఒత్తిడి లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం.' అని తెలిపారు.
{{/usCountry}}ఈ కొత్త 24/7 ప్రీమియం టాక్సీ సర్వీస్ రాకతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సేవలు అందించడంలో సరికొత్త మైలురాయిని చేరుకుందని, నగర రవాణా అనుసంధానంలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.