"నాన్న నేను వత్తా.. నాకు భయమేస్తుంది…. అమ్మ ఇంటికి తీసుపో..." అంటూ ఓ మూడేళ్ల పసికందు తన దత్తత తండ్రి మెడను గట్టిగా చుట్టేసుకుని కన్నీరుమున్నీరైన ఘటన జగిత్యాలలో ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది. కన్నప్రేమ కంటే మిన్నగా చూసుకున్న పెంపుడు తల్లిదండ్రుల నుంచి మూడేళ్ల తర్వాత బిడ్డను వేరు చేయడంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదనను అనుభవించింది.
పేగుబంధాన్ని మించిన అనుబంధం..

జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మూడేళ్ల కిందట ఒక పసికందును దత్తత తీసుకున్నారు. పుట్టిన ఐదు రోజులకే తల్లి చనిపోయిన ఆ పసిపాపను చేరదీసి…. అహర్నిశలు కంటికి రెప్పలా చూసుకున్నారు. కన్న బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమను పంచడంతో ఆ చిన్నారితో వారికి పేగుబంధానికి మించిన అనుబంధం ఏర్పడింది.
అయితే, మూడేళ్లపాటు ఎంతో ముద్దుగా పెంచుకున్న ఆ చిన్నారి దత్తత చట్టబద్ధంగా జరగలేదంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు ఇటీవల ఆ దంపతులకు షాక్ ఇచ్చారు. నియమనిబంధనలు పాటించలేదనే కారణంతో చిన్నారిని తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేసి హైదరాబాద్‌లోని శిశు విహార్‌కు తరలించారు.
అధికారుల చర్యతో తీవ్ర ఆవేదనకు గురైన సరిత, శ్రీనివాస్ దంపతులు వెంటనే న్యాయపోరాటానికి దిగారు. తమ బిడ్డను తమకే అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు….. చిన్నారిని వెంటనే ఆ పెంపుడు తల్లిదండ్రులకే అప్పగించాలని అక్టోబర్ 16న కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అమలులో జాప్యం…..!
ఉన్నత నాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ…. అధికారులు వాటిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని బాధిత దంపతులు ఆరోపించారు. కోర్టు తీర్పు వచ్చినా బిడ్డను అప్పగించకపోవడంతో ఆవేదన చెందిన దంపతులు తమ చిన్నారిని చూసేందుకు శిశు విహార్‌కు వెళ్లారు.
{{/usCountry}}ఉన్నత నాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ…. అధికారులు వాటిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని బాధిత దంపతులు ఆరోపించారు. కోర్టు తీర్పు వచ్చినా బిడ్డను అప్పగించకపోవడంతో ఆవేదన చెందిన దంపతులు తమ చిన్నారిని చూసేందుకు శిశు విహార్‌కు వెళ్లారు.
{{/usCountry}}ఆ సమయంలో దత్తత తల్లిదండ్రులను చూడగానే ఆ మూడేళ్ల బాలుడు "డాడీ నేను వత్తా.. నాకు భయమైతంది " అని గుండెలవిసేలా రోదించాడు. తండ్రి మెడను పట్టుకుని ఏడ్చిన ఆ దృశ్యం అక్కడున్న వారందరి చేత కన్నీళ్లు పెట్టించింది. దంపతులు కూడా తమ బిడ్డను గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.
హైకోర్టు తీర్పును అమలు చేయకుండా సీడబ్ల్యూసీ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ సరిత, శ్రీనివాస్ దంపతులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి తమ ఆవేదనను తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో… సోమవారం రాత్రి ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దీంతో వారు కన్నీటిపర్యంతమవుతూ… ఆనందాన్ని వ్యక్తం చేశారు.
చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ…హర్షం వ్యక్తం చేశారు. “న్యాయం గెలిచింది..మానవత్వం నిలిచింది. బాబును మా దగ్గర లేకుండా చేసి 2 నెలలు అయింది. బాబు లేకుండా మేము చనిపోతామేమో అనుకున్నాం. మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు” అని చెప్పారు.