గ్యాస్ కొరత నేపథ్యంలో పలువురు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు. దొరికిందే అదునుగా చూసి… భారీ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఫలితంగా మార్కెట్ లో గ్యాస్ కొరతతో ఇబ్బందిపడుతున్న ప్రజలు… బ్లాక్ మార్కెట్లలోని రేట్లను చూసి భయపడిపోతున్నారు.

అక్రమంగా సాగుతున్న సిలిండర్ల దందాపై ప్రభుత్వం నిఘా పెట్టింది. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ… రాష్ట్రంలోని గ్యాస్ కొరత పరిస్థితులపై ఆరా తీస్తోంది. అయితే బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు చేసేలా ఆదేశాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖతో పాటు పోలీస్ శాఖ కూడా చాలా చోట్ల సోదాలు చేపట్టింది.
3700 సిలిండర్లు సీజ్…
మార్చి 12వ తేదీ నుంచి ఇవాళ్టి(ఏప్రిల్ 3) వరకు రాష్ట్రవ్యాప్తంగా 3700 సిలిండర్లను సీజ్ చేసినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సీజ్ చేసిన వాటిలో 70 చిన్న సిలిండర్లు ఉన్నాయి. పట్టుబడిన వాటి విలువ రూ. 1.10 కోట్లు ఉంటుంది. మొత్తం 216 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎల్పీజీ సిలిండర్ల హోర్డింగ్ లేదా బ్లాక్ మార్కెటింగ్ ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. అనధికార నిల్వ లేదా అక్రమంగా ఎల్పిజీ సిలిండర్లను తిరిగి విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగానూ గ్యాస్ సరఫరాపై నిఘా కొనసాగుతోంది. అక్రమంగా నిల్వలు చేస్తే…కేసులు నమోదు చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ డేస్‌లో 2.15 లక్షల బుకింగ్స్ ఉంటాయి. అయితే యుద్ధానికి ముందు రోజూవారీ పెండింగ్ 3.50 లక్షల ఉండేవి. ఇందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా జరిగేవి. మిగిలినవి మరుసటి రోజు చేస్తుండేవారు. ఇప్పుడు డెలివరీ కావాల్సినవి 15 లక్షలు ఉన్నాయి.
సిలిండర్ల డెలివరీ వేగంగా జరిగితే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నిజానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలు మెుదలై.. సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరత అంటూ ప్రచారం అవ్వడంతో బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో సిస్టమ్ లాక్ పద్ధతిని అమలులోకి తెచ్చింది కేంద్రం. బుకింగ్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉంటే... 25 రోజులు, డబుల్ సిలిండర్లు ఉంటే 35 రోజుల లాక్ సిస్టమ్ అమలు చేస్తోంది.
{{/usCountry}}సిలిండర్ల డెలివరీ వేగంగా జరిగితే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నిజానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలు మెుదలై.. సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరత అంటూ ప్రచారం అవ్వడంతో బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో సిస్టమ్ లాక్ పద్ధతిని అమలులోకి తెచ్చింది కేంద్రం. బుకింగ్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉంటే... 25 రోజులు, డబుల్ సిలిండర్లు ఉంటే 35 రోజుల లాక్ సిస్టమ్ అమలు చేస్తోంది.
{{/usCountry}}