Hyderabad Book Fair 2026 : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్ - డిసెంబర్ 18 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'

Hyderabad Book Fair 2026 : హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 18 నుంచి 28 వరకు 39వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు రాంపల్లి రమేష్ వివరాలను వెల్లడించారు.

Updated on: Oct 18, 2026, 08:08:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hyderabad Book Fair 2026 : పుస్తక ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ముహూర్తం ఖరారైంది. 39వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 28 వరకు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రకటించింది.

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు రాంపల్లి రమేష్ వెల్లడించారు. సమాజ చైతన్యానికి అక్షరమే బలమైన ఆయుధమని వ్యాఖ్యానించారు.

"రాత అనేది ఆలోచనలకు పదును పెట్టే ఒక శక్తివంతమైన ఆయుధం. పుస్తక సంస్కృతిని విరివిగా వ్యాప్తి చేయడం, పాఠకాభిరుచిని పెంచడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత," అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా బుక్ ఫెయిర్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఆయన మీడియాకు పరిచయం చేశారు. ఈ సారి ప్రదర్శనను మరింత వైభవంగా, సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలు, రచయితలు, పుస్తక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టం చేశారు.

సొసైటీ ప్రధాన కార్యదర్శి పి. నారాయణరెడ్డి మాట్లాడుతూ…. 11 రోజుల పాటు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజూ ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో పఠనాసక్తిని, సృజనాత్మకతను పెంపొందించేందుకు 'బాలోత్సవ్' పేరిట ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.

స్టాళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత.

ఈసారి పుస్తక ప్రదర్శనలో వ్యాపారులు, పబ్లిషర్లకు ప్రాంగణంలో స్టాళ్ల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు సొసైటీ ఉపాధ్యక్షుడు కె. బాలరెడ్డి పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.ఈ

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More