ఇవాళ 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు - మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇవాళ మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. 3,752 సర్పంచ్, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు ఉండటంతో ఎన్నికలు జరగటం లేదు. ఉదయం 7 నుంచి ఒంటి గంటవరకు పోలింగ్ పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవాలను పక్కనపెట్టగా... ఈ దశలో 3,752 పంచాయతీలకు సర్పంచ్, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఈ మూడో విడత కింద 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోనూ 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 36,425 వార్డులకుగాను 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈటైమ్ దాటితే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. కానీ ఈ సమయంలోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. గంటపాటు భోజన విరామం తర్వాత.... కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది.
సాయంత్రం వరకు ఫలితాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. మరోవైపు సర్పంచ్ ఓట్లను కూడా లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే.... ఇదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు.
కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఈసీ ఆదేశించింది. చెల్లని ఓట్ల నిర్ధారణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. రీకౌంటింగ్ అవసరమైతే అందుకనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.
ఇక మూడో విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలో ఉన్న చాలా మంది ఓటర్లు తరలివెళ్లారు. శనివారం నగరంలో రద్దీ ఎక్కువగా కనిపించింది. ఎల్బీ నగర్ - నాగార్జున సాగర్ వైపు వెళ్లే రోడ్డుపై రద్దీ నెలకొంది. మరికొన్ని ప్రధాన రహదారుల్లో కూడా ఇదే మాదిరి పరిస్థితి కనిపించింది.
మూడో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 ఉదయం 10 గంటల వరకు ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు చేపట్టరాదని ఈసీ ఆదేశించింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను నివారించేందుకు పోలీసులు ఆదేశాలు ఇచ్చింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

