Amrit Bharat Scheme : అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.. లిస్టు ఇదే

Amrit Bharat Scheme : అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకు 1338 స్టేషన్లను గుర్తించింది. వాటిలో 40 స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయి.

Published on: Mar 27, 2026, 12:06:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమృత్ భారత్ స్కీమ్ కింద భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబ్‌బాద్, లింగంపల్లి, మధిర, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్ స్టేషన్లు ఉన్నాయి.

రైల్వే స్టేషన్ల అభివృద్ధి
రైల్వే స్టేషన్ల అభివృద్ధి

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బేగంపేట్, హఫీజ్‌పేట్, కరీంనగర్, రామగుండం, శ్రీబాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్ రైల్వే స్టేషన్లతో సహా పలు స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. హై-టెక్ సిటీ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం షెల్టర్, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, బుకింగ్ కౌంటర్, లిఫ్ట్, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు పూర్తయ్యాయి. కొత్త స్టేషన్ భవనం, కొత్త ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫాం ఉపరితలం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ పనులు చేపట్టారు.

కాజీపేట జంక్షన్ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం షెల్టర్, సాధారణ వెయిటింగ్ హాల్ డెవలప్‌మెంట్, టాయిలెట్, లిఫ్ట్, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవన మెరుగుదల, కొత్త వరండా, ప్లాట్‌ఫాం ఉపరితల మెరుగుదల, ఏసీ వెయిటింగ్ హాల్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ పనులు చేపట్టారు. మధిర స్టేషన్‌లో పోర్టికో, ప్లాట్‌ఫాం షెల్టర్, ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, వెయిటింగ్ హాల్ అభివృద్ధి, టాయిలెట్, పార్కింగ్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సర్క్యులేటింగ్ ఏరియా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు చేపట్టారు.

మహబూబాబాద్ స్టేషన్‌లో స్టేషన్ భవనం, పోర్టికో, ఒకటో ప్లాట్‌ఫాం వద్ద ప్లాట్‌ఫాం షెల్టర్, ప్రస్తుతం ఉన్న జనరల్ వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్, టాయిలెట్‌ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ప్లాట్‌ఫాంల వద్ద ప్లాట్‌ఫాం షెల్టర్ ఉపరితలం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, లిఫ్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు చేపట్టారు.

నల్గొండ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం షెల్టర్, వెయిటింగ్ హాల్ అభివృద్ధి, టాయిలెట్ బ్లాక్, ప్రస్తుత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) లిఫ్ట్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవన అభివృద్ధి, కొత్త ప్రవేశ ద్వారం, ప్రవేశ, నిష్క్రమణ గేటు, సైనేజ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు చేపట్టారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More