Khairatabad Ganesh : 69 అడుగులతో ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధం - వైభవంగా 'ఆగమన్'

Khairatabad Ganesh 2026 :హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి పూజ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా జరగనుంది.

Published on: Sep 12, 2026, 12:35:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Khairatabad Ganesh 2026 : భాగ్యనగరం వేదికగా ఏటా అత్యంత వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తుతో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్శించే ఈ విశిష్ట విగ్రహ తయారీ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది.

ఖైరతాబాద్ బడా గణేష్
ఖైరతాబాద్ బడా గణేష్

శ్రీ పంచముఖ సంకటహర గణపతిగా దర్శనం

ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతిని 'శ్రీ పంచముఖ సంకటహర గణపతి' రూపంలో తీర్చిదిద్దారు. భక్తుల కష్టాలను తీర్చి, సమస్త విఘ్నాలను తొలగించే ఈ అవతారం సిద్ధం చేయడానికి కళాకారులు అహోరాత్రులు శ్రమించారు. ఈ భారీ విగ్రహ రూపుకల్పన వెనుక సుమారు 150 మంది నైపుణ్యం కలిగిన మూర్తి కళాకారుల అపార శ్రమ దాగి ఉంది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ఐదు విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన శిల్పులు కలసికట్టుగా పనిచేసి ఈ ప్రతిమను అద్భుతమైన కళాఖండంగా మలిచారు.

తొలి పూజకు గవర్నర్‌కు ఆహ్వానం

ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించే తొలి పూజ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను అధికారికంగా ఆహ్వానించినట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజు కుమార్ తెలిపారు. ఆదివారం నాటికి విగ్రహానికి అమర్చిన తోడ్పాటు సహాయక కర్రలను (సపోర్టింగ్ స్టిక్స్) విడతల వారీగా తొలగించి…. పూర్తిస్థాయిలో భక్తుల సందర్శనార్థం విగ్రహాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

ముందస్తుగా శుక్రవారం రోజు నిర్వహించిన 'ఆగమన్' కార్యక్రమానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. సుమారు 10 వేల మందికి పైగా భక్తులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని గణనాథుడి పట్ల తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.మేళతాళాలు, నృత్యాలతో గణనాథుడికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం రక్షణ దృష్ట్యా కర్రల చాటున ఉన్న ఈ విగ్రహం….. రేపటి(సెప్టెంబర్ 13) నుంచి పూర్తి వైభవంతో భక్తులకు కంటిపాపలా దర్శనమివ్వనుంది.

పది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు

సిద్ధి, బుద్ధి, జ్ఞానానికి అధిపతి అయిన విఘ్నేశ్వరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈ వినాయక చవితి పండుగ పది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతుంది. ఇళ్లలో, సార్వజనిక మండపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పది రోజుల పండగ అనంతరం నదీ జలాల్లో విగ్రహ నిమజ్జనంతో ఈ ఆధ్యాత్మిక సంబరాలు ముగుస్తాయి. తెలంగాణలోనే అతి పెద్ద విగ్రహంగా పేరొందిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు ఈ పది రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More