ఇంటికి పిలిచి, బ్యాట్‌తో కొట్టి....! ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య, వెలుగులోకి అసలు విషయాలు

సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం వెలుగు చూసింది. కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో శ్రవణ్ సాయి (20) అనే యువకుడిని యువతి తరఫు బంధువులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Published on: Dec 11, 2025, 15:20:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అత్యంత దారుణం వెలుగు చూసింది. బీటెక్‌ విద్యార్థిపై దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య (representative image )
సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య (representative image )

ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి(19) అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వేర్వేరు చోట్ల చదువుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే వీరిద్దరూ టెన్త్ వరకు ఒకే చోట చదువుకున్నట్లు తెలిసింది.

వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. ఆ తర్వాత ఇరువురినీ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయినా వినిపించుకోకపోవడంతో మంగళవారం రోజున శ్రవణ్ సాయిని పెళ్లి చేస్తామని నమ్మించి…. మాట్లాడదాం రమ్మని యువతి కుటుంబసభ్యులు ఇంటికి పిలిపించారు.

ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్ తో దాడికి దిగారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రవణ్ సాయి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

వెలుగులోకి కీలక విషయాలు..!

యువకుడి హత్య కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులోని యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో యువతి తల్లి ద్వారా కీలక విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి గర్భం దాల్చినట్లు తెలిసింది. ఇదే విషయంపై వాగ్వాదం జరగగా… కూతుర్ని కొడుతుంటే శ్రవణ్ సాయి మధ్యలోకి అడ్డంగా వచ్చాడని వెల్లడించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అసలు సాయి శ్రవణ్ ను ఎవరు ఇంటికి రప్పించారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరికొన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More