Hyderabad : నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం - దట్టంగా కమ్మేసిన పొగ

నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Published on: Feb 7, 2026, 12:01:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అగ్నిప్రమాదం (representative image ) (image source Pixel)
అగ్నిప్రమాదం (representative image ) (image source Pixel)

భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా… దట్టమైన పొగ బయటకు వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు, నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

కీలక ఆధారాలు ఇక్కడే…!

FSL ల్యాబ్‌లోనే పలు కీలక కేసుల్లోని ఆధారాలున్నట్లు తెలుస్తోంది. సంబంధిత కంప్యూటర్లలో కీలకమైన కేసుల డేటా ఉన్నట్లు సమాచారం. గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్ తో పాటు MLAల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఫైల్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More