చేవెళ్ల రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం… నుజ్జునుజ్జయిన కారు - ఇద్దరు మృతి, పలువురి పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరి  పరిస్థితి విషమంగా ఉంది.

Published on: Nov 21, 2025, 10:13:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.

నుజ్జునుజ్జయిన కారు
నుజ్జునుజ్జయిన కారు

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.

ఇటీవలే చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ… ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది మరణించారు. ఇదిలా ఉండగానే…. తాజాగా చేవెళ్ల పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More