ఆటో కార్మికుల్లో ఆనందం నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. రవాణా రంగంలో కష్టపడుతున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.ఈ మేరకు మంత్రులు కీలక ప్రకటన చేశారు,

ఇటీవలనే ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ప్రజాభవన్‌లో ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో కలసి ఆత్మీయ విందులో పాల్గొని, వారి క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏదైనా సరే మానవీయ దృక్పథంతో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ నైజమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
ఇటీవల ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.... కిలోమీటర్‌కు ఉన్న రూ.11 ఛార్జీని రూ.14కు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత ధరల పెరుగుదలను బట్టి ఇప్పుడు పెంచిన రూ.14 ఛార్జీ సరిపోతుందా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని హామీ ఇచ్చింది.
ప్రత్యేకంగా బోర్డు….
రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగంపై ఆధారపడి దాదాపు 20 లక్షల కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరి ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడంపై ఇప్పటికే కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టసభల వేదికగా చర్చించి, అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించిన వెంటనే ఈ బోర్డు అందుబాటులోకి రానుంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. పాత డీజిల్ ఆటోల స్థానంలో బ్యాటరీ, సోలార్, సీఎన్జీ (CNG) ఆటోలను విరివిగా ప్రోత్సహించనున్నారు.
{{/usCountry}}పర్యావరణ పరిరక్షణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. పాత డీజిల్ ఆటోల స్థానంలో బ్యాటరీ, సోలార్, సీఎన్జీ (CNG) ఆటోలను విరివిగా ప్రోత్సహించనున్నారు.
{{/usCountry}}"రాజీవ్ యువ వికాసం" కార్యక్రమంలో భాగంగా డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్/బ్యాటరీ ఆటోలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద కొత్తగా ఈ-ఆటో కొనుగోలు చేసే ప్రతి డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.1.50 లక్షల భారీ సబ్సిడీని నేరుగా అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.