Khairatabad Assembly Seat : ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ - గెజిట్ నోటిఫికేషన్ విడుదల, త్వరలోనే ఉప ఎన్నిక..!
Khairatabad Assembly Seat : ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ అయింది.
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించటంతో… ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీగా ఉన్నట్లు శాసనసభ కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు.

తెలంగాణ ఉన్నత నాయస్థానం (హైకోర్టు) సెప్టెంబర్ 18, 2026న ఇచ్చిన తీర్పు ఆధారంగా… ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2(1)(a) తో పాటు ఆర్టికల్ 191(2) నిబంధనల ప్రకారం దానం నాగేందర్ తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయినట్లు గెజిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
అనర్హత వేటు నిర్ణయం అమలులోకి రావడంపై గెజిట్‌లో కీలక అంశాన్ని పొందుపరిచారు. 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అమలులోకి వచ్చేలా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ కార్యదర్శి ఈ చర్యలు చేపట్టారు.
త్వరలోనే ఉప ఎన్నిక…
గెజిట్ ప్రకటనతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈసీకి కూడా తగిన సమాచారం అందటంతో… ఇక్కడ బైపోల్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఉపఎన్నిక అనివార్యం కావటంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ ఇక్కడ ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా… మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పట్నుంచే ఫోకస్ చేస్తోంది. నేతలతో కూడా సంప్రదింపులు జరిపే పనిలో పడింది. మరోవైపు ఈ స్థానంపై బీజేపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నాయకత్వం కూడా సిద్ధమవుతోంది. ఇటీవలనే ఆ పార్టీ ముఖ్య నేతలు ఉప ఎన్నికపై చర్చించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

