Khairatabad Ganesh Immersion 2026 : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణేశుడు
Khairatabad Ganesh Immersion 2026 : హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనోత్సవంప్రశాంతంగా పూర్తయింది. వేలాదిమంది భక్తుల జయజయధ్వానాల నడుమ 69 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ గంగమ్మ ఒడికి చేరాడు.
Khairatabad Ganesh Immersion 2026 : ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.

అత్యంత వైభంగా శోభాయాత్ర….
శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి ఖైరతాబాద్‌లోని మంటపం నుంచి శోభాయాత్ర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు ఈ శోభాయాత్ర సాగింది. దారిపొడవునా భక్తులు చల్లిన పూలవర్షం, శివసత్తుల పూనకాలు, దప్పుల వాయిద్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర ప్రారంభ సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మహాగణపతి రథం ఎదుట ఉత్సాహంగా డాన్స్ చేసి భక్తుల్లో జోష్ నింపారు.
ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్న బడా గణేశుడికి ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ చివరి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో ఉన్న భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు.
ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగిన ఈ మహా ఊరేగింపు భక్తుల జయజయధ్వానాలతో కనుల పండువగా సాగింది. "గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ" అంటూ వేలాదిమంది భక్తులు అశ్రునయనాలతో తమ ప్రియతమ గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఈ అపూర్వ ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలకు భక్తజనం పోటెత్తింది. శోభాయాత్ర సజావుగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరం అంతటా పోలీసులు అత్యంత పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

