Sign in

Hyderabad Traffic : శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లలో వెళ్తున్నారా?

Hyderabad Traffic : శ్రీరామనవమి శోభాయాత్ర కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. పలు రూట్‌లలో వెళ్లే ప్రయాణికులు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి.

Updated on: Mar 26, 2026, 18:15:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీరామనవమి శోభాయాత్ర హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు రూట్లలో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు

మార్చి 27న హైదరాబాద్‌లో ఉదయం 9 గంటల నుంచి జరగనున్న శ్రీ రామనవమి శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, జాలి హనుమాన్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, ఎస్‌ఏ బజార్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయమశాల పాఠశాలకు చేరుకుంటుంది.

జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ జారీ చేసిన సలహా ప్రకారం.. ఊరేగింపు కదలికను బట్టి వాహనాల రాకపోకలను దశలవారీగా మళ్లిస్తారు. ఊరేగింపు చివరి భాగం ప్రతి కూడలిని దాటిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తారు.

సీతారాంబాగ్, బోయిగూడ కమన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ మళ్లి్స్తారు. అఘాపుర ఎక్స్ రోడ్, ఘోడే-కి-ఖబర్, గాంధీ విగ్రహం, పురానాపూల్ ఎక్స్ రోడ్, టక్కర్‌వాడి జంక్షన్, రాణి అవంతి బాయి విగ్రహం, అలస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, పుట్లిబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్, డీఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వద్ద ప్రధాన దారి మళ్లింపులు అమలు చేస్తారు.

బేగంబజార్ ఛత్రి, అఫ్జల్‌గంజ్ టి-జంక్షన్, శివాజీ బ్రిడ్జి, సీబీఎస్, రంగమహల్ వై జంక్షన్, పుత్లిబౌలి, కోటి, జీపీఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలిఅడ్డ వద్ద భారీ రద్దీ ఉంటుంది.

ప్రయాణికులు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వచ్చే అప్‌డేట్‌లను అనుసరించాలని సూచించారు. 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్ ద్వారా ఎమర్జెన్సీ సహాయం అందుబాటులో ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More