TG Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై బిగ్ అప్డేట్ - అర్హులకు రూ.1 లక్ష వరకు సాయం! తాజా ఆదేశాలివే

Telangana Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్‌ యువ వికాసం పథకంపై కీలక అప్డేట్ వచ్చేసింది. లబ్ధిదారులకు రూ.లక్ష వరకు స్వయం ఉపాధి సాయం అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. నవంబరు 19 నుంచి తొలి విడత సాయం అందనుంది.

Published on: Sep 16, 2026, 10:35:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగ యువతకు సొంతంగా ఉపాధి మార్గాలు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం కింద తొలి విడతగా అర్హులైన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా వేగంగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

రాజీవ్ యువ వికాసం స్కీమ్
రాజీవ్ యువ వికాసం స్కీమ్

నవంబరు 19వ తేదీ ఆర్థిక సాయం…

నవంబరు 19వ తేదీ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల చేతికి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై డిప్యూటీ మంగళవారం ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో సంక్షేమ పథకాల అమల్లో వేగం పెంచడం… గురుకుల విద్యాలయాల నిర్వహణ, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పన, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, స్కాలర్‌షిప్‌ల విడుదల, స్టడీ సర్కిళ్ల బలోపేతం వంటి పలు కీలక అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ

దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఏమాత్రం అక్రమాలకు తావులేకుండా చూడాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... "ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించాం. ఇందిరమ్మ రాజ్యంలో పేద, బహుజన వర్గాల సంక్షేమం, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు యువతకు సొంత కాళ్లపై నిలబడేలా స్వయం ఉపాధి కల్పించడమే మా ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం," అని పునరుద్ఘాటించారు.

విద్యారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నిధుల కొరత అనేదే లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. నవంబర్ 19 నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద అర్హులకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా పనులను పరుగులు తీర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

స్కీమ్ కింద ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా అప్లికేషన్లు అందాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు.

స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్‌ గ్రౌండ్‌ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More