TG Indiramma Indlu Scheme : ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ స్కీమ్ అప్డేట్ - ఈనెల 27 నుంచి లక్కీ డ్రా..! ఎక్కడ తీస్తారంటే..?
Telangana Indiramma Indlu Towers Scheme : క్యూర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారుల ఎంపికకు ఆగస్ట్ 27 నుంచి 30 వరకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు.
Telangana Indiramma Indlu Towers Scheme : హైదరాబాద్ లోని క్యూర్ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు సంబంధించి లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. లక్కీ డ్రాకు సంబంధించి పలు అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులతో చర్చించారు. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 15 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా క్యూఆర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో రూ. 807.40 కోట్ల అంచనా వ్యయంతో ఈ బహుళ అంతస్తుల నివాస సముదాయాలను నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఈ ఇండ్ల కేటాయింపు కోసం జూన్ 20 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 60,720 అప్లికేషన్లు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో 360 డిగ్రీల సమగ్ర విచారణ చేపట్టారు. ఈ పరిశీలన అనంతరం 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని అనర్హులుగా నిర్ధారించారు. పారదర్శకత కోసం అనర్హతకు గల స్పష్టమైన కారణాలను ప్రతి దరఖాస్తుదారుడి వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 27 నుంచి లక్కీ డ్రా - ప్రాంతాల వివరాలు
అర్హులైన అభ్యర్థులకు ఇండ్ల కేటాయింపు కోసం ఆగస్ట్ 27, 28, 29 మరియు 30 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు.
లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత, ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. 10,000 ఈఎండీ (EMD) మొత్తాన్ని వెంటనే వారి బ్యాంక్ ఖాతాల్లోకి రీఫండ్ చేయడం జరుగుతుంది.
- ఆగస్ట్ 27 : రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీ, మైలార్‌దేవరపల్లి, రెడ్ హిల్స్
- ఆగస్ట్ 28 : కౌకూర్, పాటిగెడ్డ, జల్ పల్లి, కుల్సుంపుర
- ఆగస్ట్ 29 : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్‌పల్లి, బండ్లగూడ (ఎల్ఐజీ కాలనీ), నందిముసలిగుడ
- ఆగస్ట్ 30 : గాజులరామారం, అంబర్ పేట్ (సిటీ పోలీస్ లైన్స్), గడ్డిఅన్నారం ఆర్&బీ క్వార్టర్స్, పోచారం (ఎల్ఐజీ కాలనీ).
మరో 4 నియోజకవర్గాల్లో కొత్తగా దరఖాస్తులు:
క్యూర్ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని హయత్‌నగర్ (అమంగల్), గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్ (ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ (ఫలక్‌నుమా సమీపంలో) ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మించనున్నారు. ఈ 4 నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ప్రజలు సెప్టెంబర్ 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

