Telangana : ఆటో కార్మికులకు మరో శుభవార్త - త్వరలోనే సంక్షేమ బోర్డు, రూ.1.50 లక్షల సబ్సిడీ కూడా..!

తెలంగాణలో ఆటో కార్మికుల సంక్షేమానికి త్వరలోనే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.1.50 లక్షల సబ్సిడీతో ఈ-ఆటోలు కూడా అందించనున్నారు. ఈ మేరకు మంత్రులు కీలక ప్రకటన చేశారు.

Published on: Oct 4, 2026, 06:02:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆటో కార్మికుల్లో ఆనందం నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. రవాణా రంగంలో కష్టపడుతున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.ఈ మేరకు మంత్రులు కీలక ప్రకటన చేశారు,

ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు

ఇటీవలనే ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ప్రజాభవన్‌లో ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో కలసి ఆత్మీయ విందులో పాల్గొని, వారి క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏదైనా సరే మానవీయ దృక్పథంతో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ నైజమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

ఇటీవల ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.... కిలోమీటర్‌కు ఉన్న రూ.11 ఛార్జీని రూ.14కు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత ధరల పెరుగుదలను బట్టి ఇప్పుడు పెంచిన రూ.14 ఛార్జీ సరిపోతుందా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని హామీ ఇచ్చింది.

ప్రత్యేకంగా బోర్డు….

రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగంపై ఆధారపడి దాదాపు 20 లక్షల కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరి ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడంపై ఇప్పటికే కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టసభల వేదికగా చర్చించి, అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించిన వెంటనే ఈ బోర్డు అందుబాటులోకి రానుంది.

పర్యావరణ పరిరక్షణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. పాత డీజిల్ ఆటోల స్థానంలో బ్యాటరీ, సోలార్, సీఎన్‌జీ (CNG) ఆటోలను విరివిగా ప్రోత్సహించనున్నారు.

"రాజీవ్ యువ వికాసం" కార్యక్రమంలో భాగంగా డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్/బ్యాటరీ ఆటోలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద కొత్తగా ఈ-ఆటో కొనుగోలు చేసే ప్రతి డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.1.50 లక్షల భారీ సబ్సిడీని నేరుగా అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More