హైదరాబాద్‌లో భారీ వర్షం - పలుచోట్ల వాటర్ లాగింగ్, ఒక్కసారిగా మారిన వాతావరణం

హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, మలక్‌పేట్, పురానాపూల్‌ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published on: Oct 30, 2026, 19:18:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఐటీ కారిడార్‌తో పాటు పాతబస్తీ, నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో హఠాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆఫీసుల వేళలు ముగిసి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఉద్యోగులు, వాహనదారులు, సామాన్య ప్రజలు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో భారీ వర్షం

పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

ఐటీ హబ్ పరిధిలోని మణికొండ, నానక్‌రాంగూడ, రాయదుర్గం, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడా, వెంగళరావునగర్ ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా వర్షం దంచి కొట్టింది. అలాగే టోలిచౌకి, లంగర్‌హౌస్, కార్వాన్, రాజేంద్రనగర్, పాతబస్తీ ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, కాప్రా, కీసర, నాగారం పరిసరాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.

ఆకస్మిక వర్షం ధాటికి నగరంలోని పలు కీలక జంక్షన్ల వద్ద రహదారులు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు మరియు హైడ్రా సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరియు మార్గదర్శకాలను జారీ చేశారు:

  • మలక్‌పేట్‌లోని అక్షయ హోటల్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో చార్మినార్, మలక్‌పేట్ వైపు నుంచి నల్గొండ క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయి. మలక్‌పేట్ ట్రాఫిక్ సిబ్బంది అక్కడే ఉండి నీటిని తొలగించడంతో పాటు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
  • పురానాపూల్ శ్మశానవాటిక సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. నీటిని వేగంగా తోడిపోసేందుకు 'హైడ్రా' బృందాలు వాటర్ మోటార్ పంపులను ఉపయోగించి నీటిని ఖాళీ చేస్తున్నాయి. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు స్థానికంగా ఉండి వాహనదారులకు సహాయం చేస్తున్నారు.
  • బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, రోడ్ నంబర్ 12 నుంచి వచ్చే వాహనదారులు కేబీఆర్ పార్క్ వన్-వే రూట్‌ను నివారించాలని పోలీసులు స్పష్టం చేశారు. అగ్రెసేన్ ఐలాండ్, తాజ్‌మహల్ యు-టర్న్, భారతీయ విద్యాభవన్ , జర్నలిస్ట్ కాలనీ మార్గాల్లో నిలిచిన నీటి కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.

వర్షం కారణంగా రోడ్లు జారేలా ఉండటం, వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక సిటీలో దాదాపు రెండు గంటలకుపైగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాకాలంలో ఏకధాటిగా ఎప్పుడూ ఈస్థాయి వర్షం కురవలేదు. ఈ ఏడాదిలో సిటీకి ఇదే అత్యధిక వ్యవధి పాటు అని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో సిటీలో కేవలం ఐదు సార్లు మాత్రమే భారీ వర్షం నమోదైన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More