...
...
Next Story

Telangana : జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ - ఏబీవీపీ పిలుపు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. తక్షణమే విద్యార్థులకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది.

Published on: Jul 12, 2026, 09:16:26 IST
Advertisement

రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద విద్యార్థులకు వరంగా మారిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడింది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ప్రకటన చేసింది.

జూలై 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్!
జూలై 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్!

ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని ఏబీవీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల విద్యా హక్కును కాలరాయడమేనని వారు విమర్శించారు.

ఒకవైపు ఫీజులు అందక, మరోవైపు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక వేలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న ఈ దోబూచులాటలో అమాయక విద్యార్థులు బలిపశువులుగా మారుతున్నారని నాయకులు మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఇలాంటి కీలకమైన పథకానికి నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఏబీవీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 14న చేపట్టే కాలేజీల బంద్‌ను విజయవంతం చేసి… ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks