తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నారాయణగూడ సర్వే భవన్ ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్(Multi Zone-2) సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 11 నుండి 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. నరహరి నివాసముంటున్న పాతబస్తీ ఛత్రినాకలోని ఇల్లు, ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లలో జరిపిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రకారం రూ.13.05 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సోదాల సమయంలో నరహరి తన బెడ్‌రూమ్‌లోని మంచం కింద, అటకపై బ్యాగుల్లో దాచిన రూ.1.54 కోట్ల భారీ నగదును చూసి అధికారులు సైతం విస్తుపోయారు. నగదును లెక్కించడానికి ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా కరెన్సీ కౌంటింగ్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది.
సుంకరి నరహరి ఇల్లు, లాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, స్థిరాస్తుల చిట్టా చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. ఇల్లు, ఆఫీసుల్లో లభ్యమైన రూ.1.54 కోట్ల నెట్ క్యాష్.. వివిధ బ్యాంకుల్లో రూ.5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న మరో రూ.2.29 కోట్లు.. ఇలా చాలా లెక్కలు ఉన్నాయి. నరహరి అవినీతికి అంతులేకుండా పోయింది. దాదాపు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నరహరి భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు, ఒక విలాసవంతమైన కారును గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల ఖరీదైన వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. పుప్పాలగూడలో ఒక అపార్ట్మెంట్, నార్సింగిలోని లగ్జరీ అపార్ట్మెంట్లో రెండు విడివిడి ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పత్రాలు లభించాయి. వీటితోపాటు టీఎన్జీవో కాలనీలో జీప్లస్ 3 (G+3) అంతస్తుల భవనం, ఛత్రినాకలో మూడంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది.
{{/usCountry}}నరహరి భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు, ఒక విలాసవంతమైన కారును గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల ఖరీదైన వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. పుప్పాలగూడలో ఒక అపార్ట్మెంట్, నార్సింగిలోని లగ్జరీ అపార్ట్మెంట్లో రెండు విడివిడి ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పత్రాలు లభించాయి. వీటితోపాటు టీఎన్జీవో కాలనీలో జీప్లస్ 3 (G+3) అంతస్తుల భవనం, ఛత్రినాకలో మూడంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది.
{{/usCountry}}గత వారం రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ.. సరిగ్గా వారం తిరగకముందే సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి భారీ అవినీతి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాన్య ప్రజల నుంచి, భూ రికార్డుల సవరణల పేరిట లంచాల రూపంలో వసూలు చేసిన సొమ్ముతోనే నరహరి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నరహరికి సంబంధించిన మరికొన్ని బ్యాంకు లాకర్లను కూడా తెరిచి తనిఖీ చేయాల్సి ఉందని, ఈ కేసులో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.