హైదరాబాద్‌లోని సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిరుపేదలకు అత్యవసర వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు విడుదల కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేషి రాఘవేందర్ (AO-1), బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (TSIDC) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) ఈ అవినీతికి పాల్పడ్డారు.
లంచం తీసుకుంటూ చిక్కిన అధికారులు…
బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ పథకం కింద మంజూరైన రూ. 2,00,000 వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ చెక్కును ఇచ్చేందుకు, మిగిలిన క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి అధికారులు లంచం డిమాండ్ చేశారు. మొదట రూ. 5,000 లంచాన్ని రాఘవేందర్ (AO-1), వినోద్ (AO-2) ద్వారా ఫోన్‌పే ట్రాన్సాక్షన్ రూపంలో తీసుకున్నాడు.
ఆ తర్వాత మిగిలిన రూ. 1,00,000 లంచం మొత్తాన్ని బాధితుడి నుంచి వినోద్ స్వీకరించి రాఘవేందర్‌కు అందించాడు. అదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఆ నగదును రాఘవేందర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తమ ప్రభుత్వ విధుల నిర్వహణలో తీవ్ర అక్రమాలకు పాల్పడి అనైతికంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారని ఏసీబీ నిర్ధారించింది.
విచారణ ముమ్మరం…
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రాఘవేందర్, వినోద్‌లను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై మరింత విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు ప్రకటించారు.
ప్రభుత్వ అధికారులు ఎవరైనా పని చేయడానికి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
{{/usCountry}}ప్రభుత్వ అధికారులు ఎవరైనా పని చేయడానికి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
{{/usCountry}}