తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుండు వాణిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. విధుల్లో ఉంటూ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారుల ప్రాథమిక తనిఖీల్లో గుండు వాణి, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్న పలు విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారం వీటి విలువ కోట్లలో ఉండగా, బహిరంగ మార్కెట్ విలువ ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.
రెండు ఓపెన్ ప్లాట్లు, ఒక నివాస ఫ్లాట్, ఒక G+2 నివాస భవనం, ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి స్థిరాస్తుల మొత్తం అధికారిక విలువ రూ. 4,25,37,000 కాగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
కేవలం స్థిరాస్తులే కాకుండా భారీ ఎత్తున నగదు, షేర్లు, వైన్స్ వ్యాపారంలో పెట్టుబడులు, ఖరీదైన వాహనాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వివిధ కంపెనీల షేర్లలో ఏకంగా రూ. 1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవాని వైన్స్‌లో రూ. 50 లక్షల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు లభించాయి. మొత్తం రూ. 50,00,000 విలువైన వాహనాలను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ. 7,97,238 నిల్వ ఉండగా ఇంట్లో రూ. 5,47,500 నగదు పట్టుబడింది. సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 5,10,000 విలువైన ఖరీదైన గృహోపకరణాలను అధికారులు లెక్కించారు.
గుండు వాణిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే సెప్టెంబర్ 30, 2026న మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ఓ పని నిమిత్తం రూ. 75,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఘటనపై కేసు నమోదైంది.
{{/usCountry}}గుండు వాణిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే సెప్టెంబర్ 30, 2026న మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ఓ పని నిమిత్తం రూ. 75,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఘటనపై కేసు నమోదైంది.
{{/usCountry}}కేసు విచారణలో భాగంగా ఆమె ఆర్థిక లావాదేవీలపై లోతుగా ఆరా తీయగా భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.